వృద్ధుడిని నగ్నంగా పరిగెత్తించిన అడవి పంది..!

ABN , First Publish Date - 2020-08-08T14:18:50+05:30 IST

ఓ వృద్ధుడిని అడవి పంది ఏకంగా నగ్నంగా కిలోమీటరు మేర పరిగెత్తించింది. జర్మనీలో టుఫెల్సీ అనే ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

వృద్ధుడిని నగ్నంగా పరిగెత్తించిన అడవి పంది..!

బెర్లిన్: ఓ వృద్ధుడిని అడవి పంది ఏకంగా కిలోమీటరు మేర నగ్నంగా పరిగెత్తించింది. జర్మనీలో టుఫెల్సీ అనే ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.  సన్‌బాతింగ్(మేని ఛాయ తగ్గించుకునేందుకు ఎండలో పడుకోవడం) కోసమని స్థానిక పార్కులో సదరు వృద్ధుడు వివస్త్రంగా ఎండలో పడుకోగా..వెనకనుంచి వచ్చిన పంది ల్యాప్ టాప్‌ ఉన్న అతడి సంచీని ఎత్తుకుపోయింది. దీంతో గాబరా పడిపోయిన వృద్ధుడు.. వెనకా ముందూ ఆలోచించకుండా అలా నగ్నంగానే ఛేజింగ్‌కు దిగాడు. ఏకంగా కిలోమీటరు మేర దాన్ని వెంబడించి తన ల్యాప్‌టాప్‌ను వెనక్కు తెచ్చుకున్నాడు.  ఈ సీన్ అంతా పబ్లిక్‌గానే జరిగింది. సన్ బాతింగ్ కోసం అక్కడికొచ్చిన అనేక మంది ముందు ఆ వృద్ధుడు పంది వెనకాల పరిగెత్తాడు. అయితే విశ్వప్రయత్నం చేసీ మరీ అతడు తన ల్యాప్‌టాప్ వెనక్కు తెచ్చుకోగలగడంతో అక్కడున్న వారందరూ చప్పట్లు కొడుతూ అతడిని ప్రశంసించారు. కాగా.. స్థానికులు తెచ్చుకున్న ఆహారన్ని తిన్న పంది అకస్మాత్తుగా వృద్ధుడి ల్యాప్‌టాప్‌తో పారిపోయినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.  ఈ ఉదంతాన్ని ఓ వ్యక్తి కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పెట్టడంతో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

Updated Date - 2020-08-08T14:18:50+05:30 IST