Allu Arjun: ‘పుష్ప’ కోసం మాజీ పోర్న్ స్టార్ డిమాండ్ ఎంతో తెలుసా?

Jul 26 2021 @ 11:33AM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’. మైత్రీ మూవీ మేక‌ర్స్, ముత్తం శెట్టి మీడియాల‌పై ఈ సినిమా రెండు భాగాలుగా నిర్మిత‌మ‌వుతుంది. దేవిశ్రీ ప్ర‌సాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. కాగా.. సుక్కు, దేవిశ్రీ కాంబినేష‌న్‌లో ఐటెం సాంగ్స్‌కు ఓ క్రేజ్ ఉంటుంది. ‘పుష్ప’లో కూడా సుకుమార్ అలాంటి ఐటెంసాంగ్‌ను ప్లాన్ చేశాడు. ఈ ఐటెం సాంగ్‌లో దిశాప‌టాని న‌టిస్తుంద‌ని వార్త‌లు వినిపించాయి. కాగా ఈ లిస్టులో మ‌రో పేరు చేరింది. అదెవ‌రో కాదు.. స‌న్నీలియోన్‌. ‘పుష్ప’ మేక‌ర్స్ రీసెంట్‌గా మాజీ పోర్న్ స్టార్, బాలీవుడ్ న‌టి స‌న్నీలియోన్‌ను సంప్ర‌దించార‌ని, ఈ ఐటెం సాంగ్‌లో న‌టించ‌డానికి ఆమె డెబ్బై ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను డిమాండ్ చేసింద‌నే వార్త నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. మ‌రి ఈ వార్త‌ల‌పై చిత్ర యూనిట్ ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి. 

శేషాచ‌ల అడ‌వుల్లో జరిగే ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో సినిమా తెర‌కెక్కుతోంది. పుష్ప‌రాజ్ అనే లారీ డ్రైవ‌ర్ పాత్ర‌లో అల్లు అర్జున్ క‌నిపించ‌నున్నారు. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రం తెలుగు, త‌మిళ‌, హిందీ, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో విడుద‌ల‌కానుంది. బ‌న్నీ ఈ సినిమాలో ర‌గ్డ్ లుక్‌లో క‌నిపిస్తున్నాడు. మలయాళ స్టార్‌ హీరో ఫహాద్‌ ఫాజిల్‌ ప్రతి నాయకుడిగా కనిపించనున్నారు. 'ఆర్య, ఆర్య2' చిత్రాల తర్వాత బన్నీ, సుకుమార్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘పుష్ప’ పార్ట్ 1 డిసెంబ‌ర్‌లో విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉంద‌ని టాక్ వినిపిస్తోంది. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.