సూర్య‘ప్రతాపం’!

ABN , First Publish Date - 2022-05-25T05:55:23+05:30 IST

సూర్య‘ప్రతాపం’!

సూర్య‘ప్రతాపం’!
ఏలూరు పాతబస్టాండ్‌ సర్కిల్‌

పిడుగులతో కూడిన భారీ వర్షం
‘పశ్చిమ’ జిల్లాలోని తాడేపల్లిగూడెం సహా పలు ప్రాంతాల్లో పిడుగులో కూడిన భారీ వర్షం కురిసింది. భీమవరం, పరిసర ప్రాంతాల్లో రాత్రి 9గంటల తర్వా త వాతావరణం మారింది. ఈదురుగాలులు, ఉరు ములు, పిడుగులతో జోరువాన కురుస్తోంది.


ఏలూరుసిటీ/భీమవరం/ఆకివీడు/పాలకొల్లు అర్బన్‌/ ద్వారకాతిరుమల, మే 24: పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలు భానుడి భగభగలతో మంగళవారం ఉడికిపోయాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో మంగళవారం ఈ వేసవిలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదయ్యింది. మూడు రోజులుగా 43–44 మధ్య నమోదవుతోంది. రోహిణీ కార్తె బుధవారం నుంచి ప్రారంభం అవుతుండగా.. ఒక రోజు ముందుగానే ఎండలు భీకరస్థాయికి చేరాయి. అధిక ఉష్ణోగ్రతలకు జనం విలవిలలాడారు. భీమవరంలో చాలా కాలం తరువాత 45 డిగ్రీలు నమోదు కావడంతో ఉదయం నుంచి ఎండ వేడిమి ప్రభావం కనిపించింది. 10గంటలకు ఉష్ణోగ్రతలో మార్పు కనిపించింది.  భీవ వరంలో నిత్యం వేలాది మంది కనిపించే బొంబే సెంటర్‌, జేపీరోడ్డు, ప్రకాశం చౌక్‌, అంబేడ్కర్‌ సెంటర్‌, బస్టాండ్‌ ఏరియాలో జన సంచారం తగ్గింది. డెల్టా ప్రాంతంలోని ఆకివీడు, నరసాపురం, పాలకొల్లు, ఆచంట ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రత ప్రభావం కనిపించింది. ఆకివీడులో ప్రధాన రహదారి, మెయిన్‌ సెం టర్‌లో వాహనాల రాకపోకలు తగ్గాయి. ఉదయం పదకొండు దాటాక వాహనదారులు రోడ్లపై పెద్దగా కనిపించకపోవడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. పాలకొల్లులో ఉదయం 10గంటల నుంచి వేడిగాలులు వీయడంతో ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఏలూరు జిల్లాలో వారం నుంచి జిల్లాలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోద వుతున్నాయి. జిల్లాలో మంగళవారం అత్యధికంగా కుక్కునూరు మండలంలో 47డిగ్రీలు నమోదైంది. ఏలూరుతో పాటు జిల్లాలోని పలు పట్టణాలు, మండ లాల్లో ఎండల తీవ్రతతో ఉక్కబోతను తట్టుకోలేక ప్రజలు ఇబ్బంది పడ్డారు.  గ్రామాల్లో పలు చోట్ల అప్రకటిత విద్యుత్‌ కోతలు ఉండటంతో ప్రజలు సతమతమవుతున్నారు. జిల్లాలో చాలా ప్రాంతాల్లో 46 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏలూరు నగరంతోపాటు జిల్లాలోని జంగారెడ్డిగూడెం, కైకలూరు, నూజివీడు, చింతలపూడి ప్రాంతాలు, మం డల కేంద్రాల్లో ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్య ంగా మారాయి. ద్వారకాతిరుమల చినవెంకన్న దర్శ నార్థం క్షేత్రానికి వచ్చే భక్తులు భానుడి ఉగ్రరూపానికి అల్లాడిపోతున్నారు.

Updated Date - 2022-05-25T05:55:23+05:30 IST