సూపర్ హిట్ కాంబో మూడవసారి..?

Jun 16 2021 @ 10:53AM

కోలీవుడ్‌లో సూపర్ హిట్ కాంబో అయిన అజిత్ - హెచ్.వినోద్ - బోనీకపూర్ కాంబినేషన్ మూడవసారి కలిసి సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఇంతక ముందు వీరి కాంబినేషన్‌లో బాలీవుడ్ హిట్ సినిమా 'పింక్' రీమేక్‌గా 'నెర్కొండ పార్వై' వచ్చి హిట్ అందుకుంది. ప్రస్తుతం ఇదే కాంబోలో 'వాలిమై' రూపొందుతోంది. అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే మరో సినిమా చేయడానికి ప్రయత్నాలు మొదలైనట్టు తెలుస్తోంది. 'వాలిమై' పూర్తవగానే ఈ సినిమా ప్రారంభం కానుందట. అంతేకాదు ఈ సినిమా టాకీపార్ట్‌ను కేవలం రెండు నెలల్లో పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. త్వరలో దీనికి సంబంధించిన అధికారక ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.