సూపర్‌ స్టార్‌ కృష్ణ 300వ చిత్రానికి పాతికేళ్ళు

Sep 28 2020 @ 22:30PM

నటశేఖర కృష్ణ నటించిన 300వ చిత్రం 'తెలుగువీర లేవరా'. సెప్టెంబర్ 29తో ఈ చిత్రం పాతికేళ్ళు పూర్తి చేసుకుంటోంది. పద్మాలయా పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రానికి ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకుడు. కృష్ణ 100వ చిత్రంగా 'అల్లూరి సీతారామరాజు', 200వ సినిమాగా 'ఈనాడు' చిత్రాలు రూపొంది ఘనవిజయం సాధించాయి. ఆ స్థాయిలో కృష్ణ 300వ చిత్రంగా రూపొందిన 'తెలుగు వీరలేవరా' ఆకట్టుకోకపోయినా, అభిమానులను అలరించింది. రోజా, కోట శ్రీనివాసరావు, చరణ్‌ రాజ్‌, మహేష్ ఆనంద్‌, రాజనాల, శ్రీహరి, బ్రహ్మానందం వంటి ప్రముఖులు ఈ చిత్రంలో నటించారు. ఈ చిత్రానికి సంగీతం కోటి. ఈ చిత్రం పాతికేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా.. సూపర్‌స్టార్ అభిమానులు సోషల్‌ మీడియాలో ఈ చిత్ర ట్యాగ్‌ను హైలెట్‌ చేస్తున్నారు.


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.