‘సూపర్‌ థాంక్స్‌’

ABN , First Publish Date - 2021-07-24T05:41:53+05:30 IST

యూట్యూబ్‌ కుటుంబంలోకి కొత్తగా మరొకటి చేరింది. యూట్యూబ్‌ ఫ్యామిలీలో నాలుగోదైన ఫీచర్‌ ‘సూపర్‌ థాంక్స్‌’.

‘సూపర్‌ థాంక్స్‌’

యూట్యూబ్‌ కుటుంబంలోకి కొత్తగా మరొకటి చేరింది. యూట్యూబ్‌ ఫ్యామిలీలో నాలుగోదైన ఫీచర్‌ ‘సూపర్‌ థాంక్స్‌’.


ఈ ఫీచర్‌తో కంటెంట్‌ క్రియేటర్లు దీంతో డబ్బులు పొందడానికి తోడు వీక్షకులతో సంబంధాలను మరింతగా పటిష్టపర్చుకునే అవకాశం కూడా ఉంటుంది. యూట్యూబ్‌లో ఉంచిన వీడియోల సృష్టికర్తలకు దీనిద్వారా వీక్షకులు తమ ఆనందం, కృతజ్ఞతలను పంచుకోవచ్చు. లోకల్‌ కరెన్సీని అనుసరించి రెండు నుంచి యాభై డాలర్లకు సూపర్‌ థాంక్స్‌ను వినియోగదారులు పొందవచ్చు. ఇప్పుడు ఇది 68 దేశాల్లోని వీక్షకులకు అందుబాటులో ఉంది. డెస్క్‌టాప్‌, మొబైల్‌ డివైస్‌(ఆండ్రాయిడ్‌, యాపిల్‌ ఐఓఎస్‌ వేదిక)ల్లో లభిస్తుంది. 

Updated Date - 2021-07-24T05:41:53+05:30 IST