Monkeypox: గాల్లో మంకీపాక్స్‌ వైరస్ వ్యాపించదు: ఫీవర్ ఆస్పత్రి సూపరింటెండెంట్

ABN , First Publish Date - 2022-07-25T17:49:45+05:30 IST

మంకీపాక్స్‌ లక్షణాలతో కామారెడ్డి జిల్లా నుంచి వ్యక్తి వచ్చాడని నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.శంకర్‌ తెలిపారు.

Monkeypox: గాల్లో మంకీపాక్స్‌ వైరస్ వ్యాపించదు: ఫీవర్ ఆస్పత్రి సూపరింటెండెంట్

హైదరాబాద్‌: మంకీపాక్స్‌(Monkeypox) లక్షణాలతో కామారెడ్డి జిల్లా నుంచి వ్యక్తి వచ్చాడని నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.శంకర్‌(Doctor shankar) తెలిపారు. బాధితుని మెడ, గొంతు, చేయి, ఛాతీపై పొక్కులు కనిపిస్తున్నాయని అన్నారు. ఐదు రకాల శాంపిల్స్‌ తీసి పరీక్షలకు పంపామని, రేపు సాయంత్రం రిపోర్ట్స్ వస్తాయని చెప్పారు. వ్యక్తి కుటుంబీకులను ఐసోలేషన్‌లో ఉంచామన్నారు. వారి కుటుంబ సభ్యులకు ఎలాంటి లక్షణాలు లేవని అన్నారు. నోటి తుంపర్ల ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుందని, గాల్లో మంకీపాక్స్‌ వైరస్ వ్యాపించదని స్పష్టం చేశారు. విదేశాల నుంచి వచ్చిన వాళ్లకు జ్వరం వస్తే ఐసోలేషన్‌లో ఉండాలని, మంకీపాక్స్‌ 6 - 13 రోజుల తర్వాతనే బయటపడుతుందని డాక్టర్ శంకర్‌ పేర్కొన్నారు. 

Updated Date - 2022-07-25T17:49:45+05:30 IST