
పుణె : ‘ఉమెన్స్ టీ20 చాలెంజ్ 2022’ (Women's T20 Challenge 2022 ) మొదటి మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్‌నోవాస్(Supernovas) నిర్ణీత 20 ఓవర్లలో 163 పరుగులకు ఆలౌట్ అయ్యింది. చక్కటి బ్యాటింగ్ ప్రదర్శనతో ప్రత్యర్థి ట్రైల్‌బ్లేజర్స్(Trailblazers)కు 164 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. సూపర్‌నోవాస్ బ్యాటర్లలో ప్రియా పునియా(22), డీయాండ్రా డొట్టిన్(32), హర్లీన్ డియోల్(35), హర్మాన్‌ప్రీత్ కౌర్(37) చొప్పున పరుగులు చేసి మెప్పించారు. కానీ ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సున్ లుస్(10), అలన్ కింగ్(5), పూజ వస్త్రకర్ (14), సోఫీ ఎక్సెల్‌స్టోన్ (5), తనియా భాటియా(1), మేఘ్నా సింగ్(2), వీ చందు(0) వెంటవెంటనే వికెట్లు కోల్పోయారు. దీంతో సూపర్‌నోవాస్ 163 పరుగులకే పరిమితమైంది.
ట్రైల్‌బ్లెజర్స్ బౌలర్లలో రాజేశ్వరీ గైక్వాడ్ 1 వికెట్, హేలే మాథ్యూస్ 3, పూనమ్ యాదవ్ 1, సల్మా ఖతున్ 2 చొప్పున వికెట్లు తీశారు. 2 రన్ ఔట్లు ఉన్నాయి.