ltrScrptTheme3

ఆ టీవీ సిరీస్‌ తప్పకుండా చూడాల్సిందేనంటున్న మ‌హేష్‌

Jul 12 2020 @ 08:38AM

‘‘జర్మనీలోని విండెన్‌ నగరం అది. ఉన్నట్టుండి అక్కడి పిల్లలు అదృశ్యమవుతుంటారు. దాని వల్ల అక్కడే నివసించే నాలుగు కుటుంబాల మధ్య బంధుత్వాలు దెబ్బతింటాయి. ఈ నేపథ్యంలో ఆ కుటుంబాల మధ్య ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అక్కడ బయటపడ్డ రహస్యం ఏంటి’’ - ప్రస్తుతం డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లో అమితంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న ‘డార్క్‌’ టీవీ సిరీస్‌ కథాంశమిది. జర్మన్‌ డైరెక్టర్‌ బరన్‌ బో ఒడర్‌ దర్శకత్వం వహించారు. ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేసిన మూడో సీజన్‌ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌గా ఆద్యంతం ఉత్కంఠగా సాగే ఈ సిరీస్‌ గురించి ఇప్పుడు సోషల్‌ మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తోంది.


నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన తొలి జర్మన్‌ సిరీస్‌ ఇది. మొదటి సీజన్‌ 2017 డిసెంబర్‌లో విడుదల కాగా, రెండో సీజన్‌ 2019 జూన్‌లో స్ర్టీమింగ్‌ అయింది. ఈ ఏడాది జూన్‌ 27న మూడో సీజన్‌ విడుదలైంది. త్వరలో నాలుగో సీజన్‌ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు దీనిపై ఎందుకింత చర్చ అంటే...


షూటింగ్‌లు లేకపోవడంతో ఇంటికే పరిమితమైన మన స్టార్లు అందరూ ప్రస్తుతం ఆసక్తికరంగా అనిపించించే ఏ సిరీస్‌ను వదిలిపెట్టడం లేదు. అందుకు మహేశ్‌బాబు మినహాయింపు కాదు. ఆయన కూడా లాక్‌డౌన్‌ మొదలైనప్పటి నుంచి పిల్లలతో ఆడుతూ, సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు చూస్తూ సరదాగా గడుపుతున్నారు. ఇటీవల మహేశ్‌ ‘డార్క్‌’ టీవీ సిరీస్‌ చూశారు. దాని గురించి సోషల్‌ మీడియాలో ప్రస్తావించారు. ‘‘ఇటీవల ‘డార్క్‌’  సిరీస్‌ 3 చూశా. రచనా, దర్శకత్వం, ఎగ్జిక్యూషన్‌ అద్భుతంగా ఉన్నాయి. తప్పకుండా చూడాల్సిన టీవీ సిరీస్‌ ఇది’’ అని కితాబిచ్చారు. ఇంగ్లీషు సబ్‌ టైటిల్స్‌తో తప్పకుండా చూడమని ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన ఓ పోస్టర్‌ షేర్‌ చేసి అభిమానులకు పిలుపునిచ్చారు. మహేశ్‌ సతీమణి నమ్రతా కూడా ‘డార్క్‌’ సిరీస్‌ గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రస్తావించారు. ‘మైండ్‌ బ్లోయింగ్‌ రియాలటీ! నిజంగా ఆశ్చర్యంగా అనిపించిందీ సిరీస్‌. ఇలాంటి కథలు అరుదుగా సాధ్యపడతాయి. నేనయితే ఈ సిరీస్‌కి పదికి పది మార్కులు ఇస్తా’’ అని ఆమె రాసుకొచ్చారు. మహేశ్‌లాంటి సూపర్‌స్టార్‌ రికమెండ్‌ చేశారంటే ఇంకేముంది... అభిమానులంతా ఇప్పుడు ‘డార్క్‌’ వేటలో పడ్డారు.


ఇటీవల మహేశ్‌బాబు ‘డార్క్‌’ టీవీ సిరీస్‌ చూశారు. దాని గురించి సోషల్‌ మీడియాలో ప్రస్తావించారు. ‘‘ఇటీవల ‘డార్క్‌’  సిరీస్‌ 3 చూశా. రచనా, దర్శకత్వం, ఎగ్జిక్యూషన్‌ అద్భుతంగా ఉన్నాయి. తప్పకుండా చూడాల్సిన టీవీ సిరీస్‌ ఇది’’ అని కితాబిచ్చారు. ఇంగ్లీషు సబ్‌ టైటిల్స్‌తో తప్పకుండా చూడమని ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన ఓ పోస్టర్‌ షేర్‌ చేశారు. 

Follow Us on:

ఓవర్సీస్ సినిమామరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.