కళాకారులను ఆదుకోండి

ABN , First Publish Date - 2021-06-16T05:00:55+05:30 IST

కరోనా సమయంలో ఎటువంటి ప్రదర్శనలు లేక ఉపాధి కోల్పోయామని, తమను ఆదుకోవాలని కళాకారులు కోరారు. ఈ మేరకు మంగళవారం తహసీల్దార్‌ ఐజాక్‌కు తమ సమస్యలను విన్నవించారు.

కళాకారులను ఆదుకోండి
కొత్తూరు తహసీల్దార్‌ బాలకు వినతి ప్రతం అందజేస్తున్న కళాకారులు

వంగర, జూన్‌ 15:  కరోనా సమయంలో ఎటువంటి ప్రదర్శనలు లేక ఉపాధి కోల్పోయామని, తమను ఆదుకోవాలని కళాకారులు కోరారు. ఈ మేరకు మంగళవారం తహసీల్దార్‌ ఐజాక్‌కు తమ సమస్యలను విన్నవించారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని, కుటుంబ పోషణ భారంగా మారిందని కళాకారులు రమణ, సాయి, గణపతి తదితరులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వం స్పందించి కళాకారులకు రూ.15 వేలు భృతి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పలువురు కళాకారులు పాల్గొన్నారు. 


జీవనోపాధికి ఇబ్బందులుపడుతున్నాం..

కొత్తూరు: కరోనా మొదటి, రెండో విడత వ్యాప్తి కారణంగా కళాకారు లకు సరైన ప్రదర్శనలు లేక జీవనోపాధికి ఇబ్బందులు తలెత్తుతున్నాయని పలువురు కళాకారులు వాపోయారు. ఈ మేరకు మంగళవారం తహసీల్దార్‌ బాలకు వినతిపత్రం అందించారు. తక్షణం స్పందించి రూ.15 వేలు ఆర్థిక సాయం అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో  కార్యక్రమం లో స్వామి,బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

 

 

Updated Date - 2021-06-16T05:00:55+05:30 IST