17000 దిగువన మద్దతు

ABN , First Publish Date - 2022-08-08T06:42:15+05:30 IST

నిఫ్టీ గత వారం పాజిటివ్‌గా ప్రారంభమైనప్పటికీ 17350 వద్ద కన్సాలిడేట్‌ అయ్యింది. ఆ తర్వాత ప్రధాన స్థాయిలైన 17500 ఎగువకు వెళ్లింది. చివరి రెండు ట్రేడింగ్‌ సెషన్లలో

17000 దిగువన మద్దతు

నిఫ్టీ గత వారం పాజిటివ్‌గా ప్రారంభమైనప్పటికీ 17350 వద్ద కన్సాలిడేట్‌ అయ్యింది. ఆ తర్వాత ప్రధాన స్థాయిలైన 17500 ఎగువకు వెళ్లింది. చివరి రెండు ట్రేడింగ్‌ సెషన్లలో మైనర్‌ రియాక్షన్‌కు కనబరిచి 17398 పాయింట్ల వద్ద క్లోజైంది. వారం మొత్తం మీద నిఫ్టీ 240 పాయింట్లు లాభపడింది. గడచిన ఆరు వారాలుగా కొనసాగుతున్న ర్యాలీలో నిఫ్టీ 2,200 పాయింట్ల వరకు లాభపడింది. ప్రస్తుత గరిష్ఠ స్థాయిల వద్ద కన్సాలిడేషన్‌ లేదా కరెక్షన్‌కు అవకాశం ఉంది. డైలీ చార్టుల ప్రకారం చూస్తే మార్కెట్‌.. స్వల్పకాలిక ఓవర్‌బాట్‌ పొజిషన్‌ను సర్దుబాటు చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. గత శుక్రవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు బలహీనంగా ముగియటంతో ఈ వారం దేశీయ మార్కెట్లలో కరెక్షన్‌కు అవకాశాలు లేకపోలేదు. తదుపరి ప్రధాన మద్దతు స్థాయి 17000. 


బుల్లిష్‌ స్థాయిలు: నిఫ్టీ ఒకవేళ రికవరీ సాధిస్తే తదుపరి ప్రధాన నిరోధ స్థాయి 17500. గత వారం ఈ స్థాయిల వద్ద నిలదొక్కుకోవటంలో విఫలమైంది. అప్‌ట్రెండ్‌ కోసం ఈ స్థాయిల వద్ద తప్పసరిగా నిలదొక్కుకోవాల్సి ఉంటుంది. తదుపరి ప్రధాన నిరోధ స్థాయిలు 17800, 18100.


బేరిష్‌ స్థాయిలు : కరెక్షన్‌లోకి  జారుకుంటే 17200 దిగువన మద్దతు స్థాయిలుంటాయి. సానుకూలత కోసం ఇక్కడ నిలదొక్కుకుని తీరాలి. ఒకవేళ బలహీనతను సూచిస్తే 17000 దిగువన మద్దతు స్థాయిలుంటాయి. సానుకూల ట్రెండ్‌ కోసం ఇక్కడ కచ్చితంగా నిలదొక్కుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ స్వల్పకాలిక బలహీనతను సూచిస్తే మాత్రం స్వల్పకాలిక ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. 


బ్యాంక్‌ నిఫ్టీ: ఈ సూచీ గత వారం ర్యాలీలో 430 పాయింట్లు లాభపడి 37900 వద్ద ముగిసింది. గత 3 నెలలుగా 38000 వద్ద బలమైన నిరోధం ఎదురవుతోంది. ఈ స్థాయిలో నిలదొక్కుకోవడం తప్పనిసరి. 


పాటర్న్‌: స్వల్పకాలిక అప్‌ట్రెండ్‌ కోసం 17500 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన రెసిస్టెన్స్‌ ట్రెండ్‌లైన్‌’’ కన్నా పైన నిలదొక్కుకోవాలి. మార్కెట్‌ 200 డిఎంఏ వద్ద పరీక్ష ఎదుర్కొంటోంది. రాబోయే కొద్ది రోజుల్లో ఇక్కడ నిలదొక్కుకోవాలి. 17000 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన సపోర్ట్‌ ట్రెండ్‌లైన్‌’’ కన్నా దిగజారితే స్వల్పకాలిక బలహీనత తప్పదు. 


టైమ్‌: ఈ సూచీ ప్రకారం గురువారం మైనర్‌ రివర్సల్‌ ఉండవచ్చు.


సోమవారం స్థాయిలు

నిరోధం : 17430, 17500

మద్దతు : 17260, 17200


www.sundartrends.in

Updated Date - 2022-08-08T06:42:15+05:30 IST