వైసీపీ కార్యకర్తలకు అండగా ఉంటా

ABN , First Publish Date - 2022-06-28T06:42:01+05:30 IST

వైఎస్‌ఆర్‌సీపీకి కార్యకర్తలే బలమని, వారికి అండగా ఉంటామని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు.

వైసీపీ కార్యకర్తలకు అండగా ఉంటా
గిద్దలూరులో మాట్లాడుతున్న ఆదిమూలపు సురేష్‌

 గిద్దలూరు ప్లీనరీలో మంత్రి సురేష్‌ వెల్లడి

గిద్దలూరు టౌన్‌ : వైఎస్‌ఆర్‌సీపీకి కార్యకర్తలే బలమని, వారికి అండగా ఉంటామని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. పట్టణంలోని చీతిరాల వెంకటేశ్వర కళ్యాణ మండపం వద్ద సోమవారం సాయంత్రం వైఎస్‌ఆర్‌సీపీ నియోజకవర్గ స్థాయి ప్లీనరీ సమావేశం జరిగింది. ముఖ్య అతిథులుగా మంత్రి ఆదిమూలపు సురేష్‌ పాల్గొని మాట్లాడుతూ ప్రస్తుత పాలనలో రాజకీయాలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయని పేర్కొన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే అన్నా రాంబాబు నాలుగు తీర్మాణాలు ప్రవేశపెట్టారు. వెలిగొండ ప్రాజెక్టును త్వరితగతిన ముఖ్యమంత్రి సహకారంతో పూర్తి చేయించడం, అర్థవీడు-రంగాపురం మధ్య రోడ్డు నిర్మాణం పూర్తయ్యేలా, పట్టణంలోని సగిలేరువాగుకు రక్షణ గోడను ఏర్పాటు చేసి వాగు వలన జరుగుతున్న నష్టాన్ని నివారించడంతోపాటు రాచర్లగేటు వద్ద వంతెన నిర్మాణం చేపట్టాలంటూ సమావేశంలో పెట్టిన తీర్మానాన్ని ఆమోదిం చారు. కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివా సరెడ్డి, కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌ యాదవ్‌, మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జునరెడ్డి, జడ్‌పి చైర్మన్‌ వెంకాయమ్మ, పార్టీ పరిశీలకులు మాధవరావు పాల్గొన్నారు.

మార్కాపురం, జూన్‌ 27: వెలుగొండ ప్రాజెక్ట్‌కు ఏడాదిలోగా కృష్ణా జలాలను తీసుకు రావడమే ప్రధాన లక్ష్యమని పట్టణ, పురపాలక శాఖమంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. స్థానిక సౌజన్య ఫంక్షన్‌ హాల్‌లో సోమవారం వైసీపీ మార్కాపురం నియోజకవర్గ ప్లీనరీ ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి అధ్యక్షత జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి సురేష్‌ మాట్లాడుతూ మార్కాపురం పట్టణాన్ని స్మార్ట్‌ సిటీగా మార్చేందుకు కృషి చేస్తానన్నారు. ఒంగోలు పార్లమెంట్‌సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మార్కా పురానికి మెడికల్‌ కళాశాల మంజూరు, నడికుడి- శ్రీకాళహస్తి రైల్లే లైన్‌ పనులు వేగవంతం చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు.  ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన మూడేళ్లలో నియోజ కవర్గలో అభివృద్ధి పనులకు రూ.935 కోట్లు చేసిందన్నారు.  పొదిలిలో పెద్ద చెరువును ఎస్‌.ఎస్‌.ట్యాంక్‌గా మార్చేందుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమం లో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ బూచేపల్లి వెంకాయమ్మ వైసీపీ జిల్లా అధ్యక్షుడు బుర్రా మధుసూదన్‌ యాదవ్‌. ఎంఎల్‌సీ టి.మాధవ రావు మాజీఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసరెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ చిల్లంచెర్ల బాలమురళీకృష్ణ, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి మీర్జా షంషీర్‌ అలీబేగ్‌, ఏఎంసీ మాజీచైర్మన్‌ గుంటక కృష్ణవేణి సుబ్బారెడ్డి, మున్సిపల్‌ వైస్‌చైర్మన్లు షేక్‌ ఇస్మాయిల్‌, చీతరాజుపల్లి అంజమ్మ శ్రీనివాస్‌, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు, మార్కాపురం నియోజకవర్గంలోని ఎంపీపీలు, జడ్పీటసీలు, వైసీపీ మండల కన్వీనర్లు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-28T06:42:01+05:30 IST