చేనేత కార్మికులను ఆదుకోవాలి: పోపా

ABN , First Publish Date - 2021-06-17T06:17:58+05:30 IST

కరోనా నేపథ్యంలో నేసిన వస్త్రాలను విక్రయించ లేక, నేత పనులు లేక ఇబ్బంది పడుతున్న చేనేత కార్మికులను ఆదుకోవాలని కోరుతూ పద్మశాలీ అఫీషియల్స్‌, ప్రొఫెషనల్స్‌ అసోసియేషన్‌(పోపా) జిల్లా అధ్యక్షడు వనం శాంతికుమార్‌, ప్రధాన కార్యదర్శి పెండెం నాగార్జున ఎమ్మెల్సీ కవితను బుధవారం కలిసి వినతిపత్రం అందజేశారు.

చేనేత కార్మికులను ఆదుకోవాలి: పోపా
ఎమ్మెల్సీ కవితకు వినతిపత్రం అందజేస్తున్న ‘పోపా’ నాయకులు

మోత్కూరు, జూన్‌ 16: కరోనా నేపథ్యంలో నేసిన వస్త్రాలను విక్రయించ లేక, నేత పనులు లేక ఇబ్బంది పడుతున్న చేనేత కార్మికులను ఆదుకోవాలని కోరుతూ పద్మశాలీ అఫీషియల్స్‌, ప్రొఫెషనల్స్‌ అసోసియేషన్‌(పోపా) జిల్లా అధ్యక్షడు వనం శాంతికుమార్‌,  ప్రధాన కార్యదర్శి పెండెం నాగార్జున  ఎమ్మెల్సీ కవితను బుధవారం కలిసి వినతిపత్రం అందజేశారు. చేనేత సహ కార సంఘాలు, మాస్టర్‌ వీవర్స్‌ వద్ద నిల్వ ఉన్న చేనేత వస్త్రాలు టెస్కో ద్వారా కొనుగోలు చేయాలని, రైతులకు మాదిరిగా చేనేత కార్మికులకు చేనేతబంధు పథకం ప్రవేశపెట్టాలని, కరోనా కాలంలో ఉపాధి కోల్పోయిన జియో ట్యాగ్‌ ఉన్న చేనేత కార్మిక కుటుంబానికి నెలకు రూ.10 వేల జీవన భృతి ఇవ్వాలని,  త్రిఫ్ట్‌ పథకం కొనసాగించాలని,  ప్రతి చేనేత కార్మికుడికి నేరుగా 40 శాతం సబ్సిడీపై నూలు, రంగులు అందించాలని, చేనేత సహ కార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని, చేనేత కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి బడ్జెట్‌లో రూ.1500 కోట్లు కేటాయించాలని వినతిపత్రంలో కోరారు. 



Updated Date - 2021-06-17T06:17:58+05:30 IST