కొవిడ్‌ బాధితులను ఆదుకోండి

ABN , First Publish Date - 2021-06-17T06:00:14+05:30 IST

కొవిడ్‌ బాధితులను తక్షణమే ఆదుకోవాలని టీడీపీ పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు డిమాండ్‌ చేశారు.

కొవిడ్‌ బాధితులను ఆదుకోండి
రెవెన్యూ కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్న టీడీపీ నాయకులు

టీడీపీ పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్‌
మండలాల్లో ఆందోళన కార్యక్రమాలు

చోడవరం, జూన్‌ 16:
కొవిడ్‌ బాధితులను తక్షణమే ఆదుకోవాలని టీడీపీ పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు అన్ని మండలాల్లోనూ టీడీపీ ఆధ్వర్యలోఓ బుధవారం ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం తహసీల్దార్లు, మండల రెవెన్యూ అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. చోడవరంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ బుద్ద మాట్లాడుతూ, కరోనాతో మరణించి వారి కుటుంబానికి రూ.10 లక్షలు, లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయిన వారికి రూ.10 వేలు ఆర్థిక సహాయం అందజేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో కొవిడ్‌ నియంత్రణ, కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. చంద్రన్న బీమా పథకం కొనసాగించి ఉంటే ప్రస్తుతం కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం తక్షణమే అందేదని పేర్కొన్నారు. పేదలకు ఎంతో ఉపయోగకరమైన చంద్రన్న బీమా పథకాన్ని వైసీపీ ప్రభుత్వం కొనసాగించకపోవడంతో వేలాది కుటుంబాలకు బీమా పరిహారం, ప్రభుత్వ సాయం అందక తీరని కష్టాల్లో పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. ఈ విపత్కర సమయంలో రైతులు పండించిన అన్ని రకాల ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నారు. అలాగే జర్నలిస్టులను ఫ్రంట్‌లైన్‌ వారియర్లుగా గుర్తించి బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి బత్తుల తాతయ్యబాబు, గోవాడ షుగర్స్‌ మాజీ చైర్మన్‌ మల్లునాయుడు, మాజీ ఎంపీపీ పెదబాబు, జడ్పీటీసీ మాజీ సభ్యుడు కనిశెట్టి మత్యరాజు, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ మజ్జి గౌరీశంకర్‌, టీడీపీ మండల అధ్యక్షులు బొడ్డేడ నాగగంగాధర్‌, త్రినాథరావు, మాలమహానాడు నాయకుడు సియ్యాద్రి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-17T06:00:14+05:30 IST