పీఏసీఎల్‌ పాలసీదారులను ఆదుకోండి

ABN , First Publish Date - 2021-05-11T05:06:18+05:30 IST

పీఏసీఎల్‌ పాలసీదారులను ఆదుకోండి

పీఏసీఎల్‌ పాలసీదారులను ఆదుకోండి
వినతిపత్రం అందజేస్తున్న ఏజెంట్లు

దౌల్తాబాద్‌: ప్రభుత్వరంగ సంస్థ సెబీ జాప్యం కారణంగా పీఏసీఎల్‌ పాలసీ ఖాతాదారులను వెంటనే ఆదుకోవాలని పీఏసీఎల్‌ ఫీల్డ్‌ ఆఫీసర్‌ మల్కయ్యగౌడ్‌ అన్నారు. సోమవారం ఖాతాదారుల ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఎంపీడీఓ తిరుమలస్వామి, డిప్యూటీ తహసీల్దార్‌ చాంద్‌పాష, ఎస్‌ఐ విశ్వజాన్‌కు పలు డిమాండ్‌లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. 2016నుంచి సెబీ సంస్థ తమ పీఏసీఎల్‌ సంస్థను విలీనం చేస్తామని సెబీలో విలీనం చేశాక సంస్థ ఖాతాదారులకు నేటికీ న్యాయం జరగడం లేదని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. సంస్థ తరపున దేశవ్యాప్తంగా దాదాపు 60వేల కోట్ల ఖాతాదారులకు చెల్లించాల్సి ఉందన్నారు. ఖాతాదారులకు మాత్రం నేటికీ ఐదు సంవత్సరాలు గడుస్తున్నా న్యాయం జరగడం లేదని వాపోయారు. ఇప్పటి వరకు 13లక్షల మందికి మాత్రమే డబ్బులు జమ చేసినట్లు తెలిపారు. పీఏసీఎల్‌ ఏజెంట్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి ఖాతాదారులు, ఏజెంట్లకు పాలసీ డబ్బులను వెంటనే అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. పీఏసీఎల్‌ ఏజెంట్లు బుగ్గప్ప, సాయిలు, రాములు, మంతరాజు, గోపాల్‌, రాజప్ప, దస్తయ్యగౌడ్‌, కుండ్రునర్సిములు పాల్గొన్నారు.  

Updated Date - 2021-05-11T05:06:18+05:30 IST