మక్కకు మద్దతు కరువు

ABN , First Publish Date - 2020-10-07T10:43:20+05:30 IST

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో మొక్కజొన్న రైతుకు ప్ర భుత్వ మద్దతు కరువైంది. ప్రభుత్వం మొక్కజొన్న కొనుగో లు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో

మక్కకు మద్దతు కరువు

మొక్కజొన్నకు దక్కని మద్దతు ధర

సిండికేట్‌గా మారిన వ్యాపారులు, దళారులు 

క్వింటాలు ధర రూ.1,350 లోపే 

తీవ్రంగా నష్టపోతున్న రైతులు

ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతుల డిమాండ్‌

వేచి చూస్తున్న కామారెడ్డి జిల్లా రైతులు


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, నిజామాబాద్‌)

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో మొక్కజొన్న రైతుకు ప్ర భుత్వ మద్దతు కరువైంది. ప్రభుత్వం మొక్కజొన్న కొనుగో లు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో వ్యాపారులు, దళా రులదే హవా కొనసాగుతోంది. మార్కెట్‌లో నామమాత్రపు కొనుగోళ్లు జరుగుతుండడంతో తప్పనిసరి తక్కువ ధరకే రై తులు అమ్ముకోవాల్సి వస్తోంది. గత సంవత్సరం మార్క్‌ఫెడ్‌ ద్వారా మద్దతు ధరకు అమ్ముకున్న రైతులు.. ప్రస్తుతం త క్కువ  ధరకు అమ్ముకుంటున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేం ద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో మొక్కజొన్న వేసిన రైతు లు భారీగా నష్టపోతున్నారు.


సర్కారు వద్దన్నా 80వేల ఎకరాలలో సాగు 

నియంత్రిత సాగు విధానంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వానాకాలంలో మొక్కజొన్నను సాగు చేయవద్దని సూచించిoది. వ్యవసాయశాఖ అధికారుల ద్వారా వానాకాలం సాగు ఆరంభంలో మొక్కజొన్న వేసే గ్రామాలలో అవగాహన సద స్సులు సైతం నిర్వహించింది. మొక్కజొన్నకు బదులు ఇతర పంటలు వేసుకోవాలని అధికారులు అవగాహన కల్పించా రు. కొంత మంది రైతులు ప్రభుత్వం సూచించిన విధంగా సోయా, ఇతర పంటలు వేశారు. ఏళ్ల తరబడి మొక్కజొన్న సాగు చేస్తున్న కొంతమంది రైతులు మాత్రం వానాకాలంలో మొక్కజొన్నను సాగుచేశారు. ఉమ్మడి జిల్లా పరిధిలో సు మారు 80 వేల ఎకరాలలో మొక్కజొన్న పంటను వేశారు. నిజామాబాద్‌ జిల్లాలో 25 వేల ఎకరాల వరకు సాగు చేయ గా.. కామారెడ్డి జిల్లా పరిధిలో 55 వేల ఎకరాలలో వేశారు. ప్రస్తుతం పంట చేతికి వస్తుండడంతో ధరరాక రైతులు ఆం దోళన చెందుతున్నారు. 


రూ.1,100 నుంచి రూ.1,350లోపే ధర 

కేంద్ర ప్రభుత్వం మొక్కజొన్న క్వింటాలుకు రూ.1,850ల మద్దతు ధర నిర్ణయించింది. ఈ ధరకు మార్కెట్‌తో పాటు వ్యాపారులు కొను గోలు చేయాలని కోరింది. ఉమ్మడి జిల్లా పరి ధిలో ప్రస్తుతం ఆ రేటు కనిపించడం లేదు. గత సంవత్సరం లాగా మార్క్‌ఫెడ్‌ కోనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో ధర భాగా తగ్గింది. వ్యాపారు లు, దళారులు సిండికేట్‌గా మారడంతో మొక్కజొన్న క్విం టాలుకు 1,100 రూపాయల నుంచి 1,350 రూపాయల మ ధ్యనే అమ్మకాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం కొనుగోలుకు ముందుకు రాక పోవడంతో గ్రామాలకు వెళ్లి వ్యాపారులు కొ నుగోలు చేస్తు న్నారు. రైతులకు తక్కవ ధర ఇస్తున్నారు. ఇ తర ప్రాంతాలకు తీసుకువెళ్లినా ధర లేకపోవడం.. ధర తగ్గి నా నిల్వచేసే పరిస్థితి లేక విక్రయిస్తున్నారు. గత సంవత్స రం మార్క్‌ఫెడ్‌ కోనుగోలు కేంద్రాలలో మద్దతు ధరకు అ మ్ముకున్న రైతులు ప్రస్తుతం తక్కువ ధరకు అమ్ముకుంటు న్నారు.


తడిసి, నల్ల బడిన మొక్కజొన్నలను కొనేవారు లేక క్వింటాలు వెయ్యి రూపాయాలకే అమ్ముకుంటున్నారు. గత సంవత్సరంతో పోల్చితే కోనుగోలు కేంద్రాలు లేక క్వింటాలు కు 500 రూపాయల వరకు నష్టపోతున్నారు. నిజామాబాద్‌ జిల్లా పరిధిలోని మొక్కజొన్న పండించే ఏర్గట్ల, మోర్తాడ్‌, మెండోరా, వేల్పూర్‌, ముప్కాల్‌, బాల్కొండ మండలాల్లో రై తులు అమ్మకాలు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా పరిధిలోని గాంధారి, తాడ్వాయి, లింగంపేట, సదాశివనగర్‌, కామారెడ్డి, మాచారెడ్డి మండలాలలో భారీగా సాగు చేసినా అమ్మకాలు చేపట్టడం లేదు. ఇప్పుడిప్పడే కొంత మంది రైతులు అమ్మ కాలు చేస్తున్నా... మెజారిటీ రైతులు వేచి చూసే ధోరణి అవ లంబిస్తున్నారు.


మొక్కజొన్నలను ప్రభుత్వమే కోనుగోలు చే యాలని కోరుతున్నారు. గత సంవత్సరంలాగా ప్రభుత్వం కో నుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. మార్క్‌ఫెడ్‌ అధికారులు మాత్రం తమకు సమాచారం లేద ని తెలిపారు. ప్రభుత్వం నియంత్రిత సాగులో భాగంగా మొ క్కజొన్న వేయవద్దని కోరినా సాగుచేయడంతో ఈదఫా కొన కపోవచ్చని అధికారుల సమాచారం బట్టి తెలుస్తోంది. ఉ మ్మడి జిల్లా పరిధిలో మొక్కజొన్న సాగుచేసిన రైతులు మా త్రం ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి కోను గోలు చేసేవిధంగా చూ డాలని కోరుతున్నారు. 


ప్రభుత్వమే కొనుగోలు చేయాలి..సోమదేవారెడ్డి, తాళ్ల రాంపూర్‌

మొక్కజొన్నలను ప్రభుత్వమే కోనుగోలు చేయాలి. రైతు లకు మద్దతు ధర వచ్చే విధంగా చూడాలి. ప్రభుత్వం పట్టి ంచుకోకపోవడం వల్ల తక్కువ ధరకు అమ్ముకుంటున్నాం. మార్క్‌ఫెడ్‌ ద్వారా వెంటనే కోనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసే విధంగా చూడాలి.


Updated Date - 2020-10-07T10:43:20+05:30 IST