ltrScrptTheme3

వేదాంత్‌కి కానుకగా నిండైన ఆరోగ్యాన్ని ఇవ్వండి...

Feb 12 2021 @ 18:58PM

కిందటేడాది డిసెంబర్ నెలలో 2 సంవత్సరాల వయసు వాడైన మా అబ్బాయి వేదాంత్ ఆరోగ్యం క్షీణించడం మొదలైంది.


రోజుల తరబడి తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ తరచుగా కడుపు నొప్పు వస్తోందని చెప్పేవాడు. మా అర్థిక పరిస్థితి అంత బాగా లేనందువల్ల డాక్టర్ దగ్గరకు వెళితే మరిన్ని ఖర్చులు అవుతాయన్న భయంతో వీలైనంత వరకూ మా బాబును ఇంట్లోనే జాగ్రత్తగా చూసుకునేవాళ్ళం.


"నా భర్త కాశీనాథ్ రోజువారీ పనులు చేస్తుంటాడు. ఆయనకు వచ్చే డబ్బులతో ఏ రోజుకారోజు మా జీవితాలు గడవడానికి మాత్రమే సరిపోయే పరిస్థితి. రోజులు గడుస్తున్నా... మా అబ్బాయి వేదాంత్ ఆరోగ్య పరిస్థితి మెరుగవకపోవడంతో నా మనసు ప్రమాదాన్ని శంకించింది. అదే సమయంలో వాడికి ట్రీట్‌మెంట్ ఖర్చులు భరించడం ఎలా... అనే ఆందోళన కూడా నన్ను వెంటాడింది."


దయచేసి వేదాంత్‌కి నిండైన ఆరోగ్యాన్ని కానుకగా ఇవ్వండి.... ఇప్పుడే విరాళం అందజేయండి. 

చిన్నపాటి చికిత్సతోనే ఆరోగ్యం చేకూరాలని ప్రార్థిస్తూ మా అబ్బాయిని మాకు దగ్గర్లో ఉన్న డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళాము. దురదృష్టవశాత్తు, వేదాంత్‌కు వస్తున్న జ్వరం మామూలు విషయం కాదంటూ డాక్టర్ వెంటనే పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్ళమని సూచన చేశారు. ఆస్పత్రిలో చాలా టెస్ట్‌లు చేశాక మా అబ్బాయి బ్లడ్ క్యాన్సర్ (Acute Lymphoblastic Leukemia)కి గురైనట్లు చెప్పారు.


ఆ మాట వింటూనే నా గుండె చెరువైపోయింది. నా కొడుకును ఎలా కాపాడుకోవాలో తెలియక ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పోయాను. మాది చాలా చాలా చిన్న కుటుంబం. మాకు డబ్బు లేకపోయినా మా అబ్బాయి నవ్వుల్లోనే ఆనందాన్ని వెదుక్కునేవారం. మా చిన్న జీవితానికే ముప్పు వచ్చింది.


వేదాంత్ చికిత్స కోసం అమ్మడానికి మాదగ్గర చిన్నపాటి విలువైన వస్తువు కూడా లేదు. మా స్నేహితులు, బంధువుల్ని వేడుకుంటే ఎలాగో కీమోథెరపీ రెండు సైకిల్స్‌కి మాత్రం డబ్బు సమకూర్చగలిగాం. కానీ, మేం ఇలా ఎక్కువ రోజులు కొనసాగించలేం. వేదాంత్‌కి మొత్తం కీమోథెరపీ ఖర్చు రూ.5,20,000 వరకూ ఖర్చవుతుంది.


చికిత్స కోసం వేదాంత్‌కు పదే పదే సూదులు గుచ్చుతుంటే, ఆ నొప్పి భరించలేక వాడు పడుతున్న బాధ నా గుండెను చీల్చేస్తోంది. కానీ, వాడి జీవితాన్ని కాపాడాలంటే ఇదొక్కటే మార్గం.


వేదాంత్ కోసం డబ్బు సమకూర్చుకోకపోతే వాడు అనుభవిస్తున్న ఈ బాధ, వేదనకు ఒక పరిష్కారమే ఉండదన్న ఆలోచనే మమ్మల్ని నిలవనీయడం లేదు. ఇప్పుడు మీ అండదండలపైనే మా ఆశలన్నీ పెట్టుకున్నాం....


మా అబ్బాయిని ఈ క్యాన్సర్ వ్యాధి నుంచి రక్షించుకునేందుకు సహకరించండి. మీరిచ్చేది చిన్న విరాళమే అయినప్పటికీ, అది వేదాంత్ కీమోథెరపీ పూర్తి చేయించి వాడిని రక్షించుకునేలా మమ్మల్ని నడిపిస్తుంది.


దయచేసి వేదాంత్‌కి నిండైన ఆరోగ్యాన్ని కానుకగా ఇవ్వండి.... ఇప్పుడే విరాళం అందజేయండి.

Follow Us on:

జాతీయం మరిన్ని...

చిత్రజ్యోతి మరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.