క్రీడా పోటీలకు సహాయ సహకారాలు ఉంటాయి : రామన్‌గౌడ్‌

ABN , First Publish Date - 2021-03-01T03:52:26+05:30 IST

జిల్లాలోని క్రీడా పోటీలకు తనవంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రామన్‌గౌడ్‌ అన్నారు.

క్రీడా పోటీలకు సహాయ సహకారాలు ఉంటాయి : రామన్‌గౌడ్‌
రామన్‌గౌడ్‌ని సన్మానిస్తున్న అసోసియేషన్‌ సభ్యులు

వనపర్తి అర్బన్‌, ఫిబ్రవరి 28: జిల్లాలోని క్రీడా పోటీలకు తనవంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రామన్‌గౌడ్‌ అన్నారు. ఆదివారం బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ సభ్యులు ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రామన్‌గౌడ్‌ మాట్లాడారు. పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులు క్రీడల్లో రాణించాలని సూచించారు. భాస్కర్‌రెడ్డి, సబిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-03-01T03:52:26+05:30 IST