జమ్మూకశ్మీరులో 4జీ నెట్‌ ఇవ్వండి: సుప్రీం

ABN , First Publish Date - 2020-08-08T07:41:08+05:30 IST

జమ్మూకశ్మీరులోని కొన్ని ప్రాంతాలలో 4జీ ఇంటర్నెట్‌ సేవలను పునరుద్ధరించే అవకాశాలను పరిశీలించాల్సిందిగా సుప్రీంకోర్టు జమ్మూకశ్మీరు అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది...

జమ్మూకశ్మీరులో 4జీ నెట్‌ ఇవ్వండి: సుప్రీం

న్యూఢిల్లీ, ఆగస్టు 7: జమ్మూకశ్మీరులోని కొన్ని ప్రాంతాలలో 4జీ ఇంటర్నెట్‌ సేవలను పునరుద్ధరించే అవకాశాలను పరిశీలించాల్సిందిగా సుప్రీంకోర్టు  జమ్మూకశ్మీరు అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. జేకే కేంద్రపాలిత ప్రాంతానికి నూతన లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా  మనోజ్‌ సిన్హా నియమితులయ్యారని, దీనిపై నిర్ణయం తీసుకోవడానికి కొంత వ్యవధి కావాలని యూటీ యంత్రాంగం తరఫున ఎస్జీ తుషార్‌ మెహతా తెలిపారు. ఎల్జీ మారినంత మాత్రాన ఏమీ మారిపోదని,  4జీ పునరుద్ధరణపై ఏర్పాటైన ప్రత్యేక కమిటీ యథాతథంగా ఉంటుందని ధర్మాసనం మెహతాకు స్పష్టం చేసింది.  

Updated Date - 2020-08-08T07:41:08+05:30 IST