Teesta Setalvad: తీస్తా సెతల్వాద్‌‌కు బెయిల్ మంజూరు... కానీ...

ABN , First Publish Date - 2022-09-02T21:47:34+05:30 IST

న్యూఢిల్లీ: రెండు నెలలుగా కస్టడీలో ఉన్న న్యాయవాది తీస్తా సెతల్వాద్‌‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

Teesta Setalvad: తీస్తా సెతల్వాద్‌‌కు బెయిల్ మంజూరు... కానీ...

న్యూఢిల్లీ: రెండు నెలలుగా కస్టడీలో ఉన్న సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్‌‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆమె తన పాస్‌పోర్ట్‌ను సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అంతేకాదు విచారణకు పూర్తి స్థాయిలో సహకరించాలని కూడా సుప్రీం ఆదేశాలిచ్చింది. ఇదే సమయంలో సుప్రీంకోర్టు గుజరాత్ హైకోర్టుకు మరో సూచన కూడా చేసింది. తీస్తా సెతల్వాద్‌ బెయిల్ విషయంలో కేవలం తాము ఆదేశించామని కాకుండా, ఎలాంటి ఒత్తిళ్లకూ లొంగకుండా, స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవచ్చని కూడా గుజరాత్ హైకోర్టుకు తెలిపింది.  







సుప్రీం కోర్టు నిన్న బెయిల్‌కు అవకాశాలు లేని పోటా, ఉపా వంటి కేసులు  తీస్తా సెతల్వాద్‌పై లేవని తెలిపింది. 2002 నాటి గుజరాత్‌ అల్లర్లలో తప్పుడు పత్రాలు సృష్టించి వాజ్యాలు వేశారన్న ఆరోపణలపై పోలీసులు కేసు పెట్టి ఆమెను ఇటీవలే అదుపులోకి తీసుకున్నారు. ఆమె పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్‌ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ యు.యు.లలిత్‌, జస్టిస్‌ రవీంద్ర భట్‌, జస్టిస్‌ సుధాంశు ధులియాల ఆధ్వర్యంలోని ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. ఆమెపై తీవ్రమైన ఆరోపణలేవీ లేవని, ఐపీసీలోని సెక్షన్‌ 437 కింద సాధారణ నేరాన్నే మోపారని జస్టిస్‌ లలిత్‌ మౌఖికంగా తెలిపారు. ఒక మహిళగా సానుకూల నిర్ణయానికి ఆమె అర్హురాలని చెప్పారు. భారత నేర స్మృతి కింద అనుకూలమైన నిర్ణయానికి ఆమె అర్హురాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

Updated Date - 2022-09-02T21:47:34+05:30 IST