Dharam Sansad ద్వేషపూరిత ప్రసంగం కేసు విచారణకు సుప్రీం అంగీకారం

ABN , First Publish Date - 2022-01-10T17:48:00+05:30 IST

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్ లో జరిగిన ధరం సంసద్ హిందూ సమావేశంలో ద్వేషపూరిత ప్రసంగం కేసును విచారించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది.

Dharam Sansad ద్వేషపూరిత ప్రసంగం కేసు విచారణకు సుప్రీం అంగీకారం

న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్ లో జరిగిన ధరం సంసద్ హిందూ సమావేశంలో ద్వేషపూరిత ప్రసంగం కేసును విచారించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. ధరం సంసద్ సమావేశంలో ముస్లిం వ్యతిరేక ప్రకటనలు చేసిన విషయంపై టీఎంసీ నాయకుడు ఫిర్యాదు చేశారు. ధర్మసంసద్ హరిద్వార్ ద్వేషపూరిత సమావేశం వీడియోలు సోషల్ మీడియాలో చాలాసార్లు షేర్ చేశారు.ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో వివాదాస్పద హిందుత్వ నాయకుడు యతి నర్సింహానంద్ నిర్వహించిన హిందువుల సమావేశంలో ముస్లిం వ్యతిరేక ప్రకటనలు చేశారు.ధర్మ్ సంసద్ ద్వేషపూరిత ప్రసంగం అంశం చాలా ప్రమాదకరమని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీంకోర్టుకు తెలిపారు. 


‘‘ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు, కానీ ఇప్పటివరకు ఎటువంటి చర్య తీసుకోలేదు, నిందితులను అరెస్టు చేయలేదు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని నేను సుప్రీంకోర్టును అభ్యర్థిస్తున్నాను’’ అని కపిల్ సిబల్  చెప్పారు.డిసెంబరు 17 నుంచి డిసెంబర్ 19 వరకు ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో జరిగిన మూడు రోజులపాటు జరిగిన ధరం సంసద్ సభలో మైనారిటీ వర్గాలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేశారు. ఈ సమావేశంలో ప్రసంగించిన పలువురు హిందూ మత పెద్దలు, ఆయుధాలు చేపట్టాలని సమాజానికి పిలుపునిచ్చారు. ముస్లింలకు వ్యతిరేకంగా వారు హిందూ దేశం ఏర్పాటు కోసం స్పష్టమైన పిలుపు ఇచ్చారు.ద్వేషపూరిత ప్రసంగాలకు సంబంధించి ఇద్దరిపై కేసు నమోదు చేశారు.


Updated Date - 2022-01-10T17:48:00+05:30 IST