ముస్లిం కోటాపై Amit Shah వ్యాఖ్యలు సుప్రీంకోర్టు ధిక్కారమే: షబ్బీర్‌ అలీ

ABN , First Publish Date - 2022-05-16T00:23:15+05:30 IST

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా (Amit Shah)కు ముస్లిం కోటా చరిత్ర, చట్టపరమైన స్థితి గురించి తెలియదని కాంగ్రెస్‌

ముస్లిం కోటాపై Amit Shah వ్యాఖ్యలు సుప్రీంకోర్టు ధిక్కారమే: షబ్బీర్‌ అలీ

కామారెడ్డి: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా (Amit Shah)కు ముస్లిం కోటా చరిత్ర, చట్టపరమైన స్థితి గురించి తెలియదని కాంగ్రెస్‌ నేత షబ్బీర్‌అలీ విమర్శించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే 4శాతం ముస్లిం కోటాను రద్దు చేస్తామని బీజేపీ ప్రజా సంగ్రామ యాత్రలో అమిత్‌షా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని తెలిపారు. ఆదివారం షబ్బీర్‌ అలీ మీడియాతో మాట్లాడుతూ అమిత్‌షా చేసిన వ్యాఖ్యలు విద్వేషపూరితంగా ఉన్నాయన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యలో 4శాతం ముస్లిం కోటాను 2004లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, ఇంకా సుప్రీంకోర్టు (Supreme Court)లో పెండింగ్‌లో ఉందని వివరించారు. బీజేపీ ప్రభుత్వం ముస్లిం కోటాను రద్దు చేస్తుందని ప్రకటించడం ద్వారా అమిత్‌షా కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారన్నారు. ముస్లిం కోటాను మతప్రాతిపదికన ఇవ్వలేదని ఈ విషయాన్ని అమిత్‌షా గ్రహించాలని షబ్బీర్‌ అలీ పేర్కొన్నారు.

Updated Date - 2022-05-16T00:23:15+05:30 IST