రుషికొండ తవ్వకాలపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ సర్కార్

ABN , First Publish Date - 2022-05-23T19:18:19+05:30 IST

రుషికొండ తవ్వకాలపై ఏపీ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విశాఖలో రుషికొండ తవ్వకాలపై ఎన్జీటీ ధర్మాసనం స్టే విధించింది.

రుషికొండ తవ్వకాలపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ సర్కార్

ఢిల్లీ: రుషికొండ తవ్వకాలపై ఏపీ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విశాఖలో రుషికొండ తవ్వకాలపై ఎన్జీటీ ధర్మాసనం స్టే విధించింది. ఎన్జీటీ ఆదేశాలను ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. పర్యావరణ అనుమతులన్నీ పొందిన తర్వాతే.. రుషికొండ తవ్వకాలను చేపట్టినట్లు ఏపీ సర్కార్ పేర్కొంది. పర్యావరణానికి ఎటువంటి హానీ కలగకుండా.. తవ్వకాలు, నిర్మాణాలు చేపడతామని పిటిషన్‌లో ఏపీ ప్రభుత్వం పేర్కొంది. ఎంపీ రఘురామ గతేడాది దాఖలు చేసిన పిటిషన్‌పై ఈనెల 6న ఎన్జీటీ విచారణ జరిపింది. తవ్వకాలపై అధ్యయనం చేసేందుకు సంయుక్త కమిటీని నియమించింది. నెల రోజుల్లో నివేదిక అందించాలని కమిటీకి ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వుల వరకు ఎలాంటి తవ్వకాలూ జరపరాదని ఎన్జీటీ ఆదేశించింది. త్వరలో రుషికొండ తవ్వకాలపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.

Updated Date - 2022-05-23T19:18:19+05:30 IST