ఏపీ ప్రభుత్వం, టీడీపీకి సుప్రీంకోర్టు నోటీసులు

ABN , First Publish Date - 2020-10-27T18:05:41+05:30 IST

గుంటూరులో టీడీపీ కార్యాలయ భూ వివాదంలో ఏపీ ప్రభుత్వం

ఏపీ ప్రభుత్వం, టీడీపీకి సుప్రీంకోర్టు నోటీసులు

న్యూఢిల్లీ/అమరావతి : గుంటూరులో టీడీపీ కార్యాలయ భూ వివాదంలో ఏపీ ప్రభుత్వం, టీడీపీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లో సమాధానం ఇవ్వాలని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఇప్పటికే హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుతో పాటు వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల పిటిషన్‌ను కూడా కలిపి విచారించాలని కోర్టు నిర్ణయించింది. అనంతరం తదుపరి విచారణను సుప్రీంకోర్టు ధర్మాసనం వాయిదా వేసింది. పిటిషనర్ తరఫున ప్రశాంత్ భూషణ్, రమేష్ వాదనలు వినిపించారు.


పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించి భూ కేటాయింపులు జరిపారని.. టీడీపీ ఆఫీస్ కోసం జరిపిన భూ కేటాయింపులు రద్దు చేయాలని పిటిషనర్ కోర్టును కోరారు. గతంలో ఆర్కే పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. హైకోర్టు ఉత్వర్వులను ఆర్కే సుప్రీంకోర్టులో సవాలు చేశారు. దీనిపై ఇవాళ సుప్రీంకోర్టు విచారించి నోటీసులు జారీ చేయడం జరిగింది. కాగా.. ఆత్మకూరు పరిధిలోని సర్వే నంబర్ 392లో ఉన్న 3.65 ఎకరాల వాగు పోరంబోకు భూమిని టీడీపీ కార్యాలయ నిర్మాణానికి 99 సంవత్సరాల పాటు లీజుకిస్తూ గత ప్రభుత్వం 2017లో జీవో జారీ చేసిందని ఎమ్మెల్యే ఆర్కే అప్పట్లో ఆరోపించడం సంచలనమైంది.

Updated Date - 2020-10-27T18:05:41+05:30 IST