Chsttisgarh: నక్సల్ ఏరివేత చర్యల్లో గ్రామస్థుల హత్యపై దర్యాప్తునకు సుప్రీంకోర్టు తిరస్కరణ

ABN , First Publish Date - 2022-07-14T18:14:32+05:30 IST

ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్‌ను ఏరివేయడం కోసం నిర్వహించిన కార్యకలాపాల్లో కొందరు

Chsttisgarh: నక్సల్ ఏరివేత చర్యల్లో గ్రామస్థుల హత్యపై దర్యాప్తునకు సుప్రీంకోర్టు తిరస్కరణ

న్యూఢిల్లీ : ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్‌ను ఏరివేయడం కోసం నిర్వహించిన కార్యకలాపాల్లో కొందరు సామాన్య గ్రామస్థులు ప్రాణాలు కోల్పోయిన సంఘటనపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురువారం తోసిపుచ్చింది. పిటిషనర్ రూ.5 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. 2009లో ఈ సంఘటన జరిగిందని పిటిషనర్ ఆరోపించారు. 


సామాజిక కార్యకర్త హిమాంశు కుమార్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ జేబీ పర్దీవాలా ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చింది. ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో 2009లో జరిగిన యాంటీ నక్సల్ ఆపరేషన్‌లో దాదాపు 12 మంది గ్రామస్థులు ప్రాణాలు కోల్పోయారని పిటిషనర్ ఆరోపించారు. 


Updated Date - 2022-07-14T18:14:32+05:30 IST