జహంగీర్‌పురిలో ఆక్రమణల తొలగింపుపై సుప్రీంకోర్టు స్టే

ABN , First Publish Date - 2022-04-20T16:52:49+05:30 IST

దేశ రాజధాని నగరం ఢిల్లీలోని జహంగీర్‌పురిలో ఆక్రమణల

జహంగీర్‌పురిలో ఆక్రమణల తొలగింపుపై సుప్రీంకోర్టు స్టే

న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరం ఢిల్లీలోని జహంగీర్‌పురిలో ఆక్రమణల తొలగింపు కోసం ఉత్తర  ఢిల్లీ నగర పాలక సంస్థ చేపట్టిన చర్యలను సుప్రీంకోర్టు బుధవారం నిలిపేసింది. ఈ అంశంపై తదుపరి విచారణ గురువారం జరుగుతుందని తెలిపింది. ఇదే అంశంపై విచారణ జరిపేందుకు ఢిల్లీ హైకోర్టు అంగీకరించింది. బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు దీనిపై విచారణ జరపనున్నట్లు చెప్పింది. 


హనుమాన్ జయంతి శోభాయాత్ర సందర్భంగా శనివారం ఈ ప్రాంతంలో ఘర్షణలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు మైనర్లు, 25 మంది వయోజనులను ఈ కేసులో అరెస్టు చేశారు. 


ఉత్తర ఢిల్లీ నగర పాలక సంస్థ అధికారులు బుధవారం ఈ ప్రాంతంలోని అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు ప్రయత్నించింది. కట్టుదిట్టమైన భద్రత నడుమ కొన్ని ఆక్రమణలను తొలగించింది. ఈ నేపథ్యంలో ఈ చర్యలను నిలిపేయాలని కోరుతూ ఓ పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలైంది. సీనియర్ అడ్వకేట్ దుష్యంత్ దవే వాదనలు వినిపిస్తూ, జహంగీర్ పురి ఏరియాలో అనధికారికంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఆక్రమణలను తొలగిస్తున్నారని ఆరోపించారు. 


Updated Date - 2022-04-20T16:52:49+05:30 IST