Agnipath పథకంపై పిల్...విచారణకు స్వీకరించిన Supreme Court

ABN , First Publish Date - 2022-07-04T17:25:53+05:30 IST

దేశంలో సైనిక దళాల్లో ప్రవేశం కోసం కొత్తగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది....

Agnipath పథకంపై పిల్...విచారణకు స్వీకరించిన Supreme Court

న్యూఢిల్లీ: దేశంలో సైనిక దళాల్లో ప్రవేశం కోసం కొత్తగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. కేంద్ర ప్రభుత్వ అగ్నిపథ్ పథకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై వచ్చే వారం విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. సెలవుల తర్వాత సుప్రీంకోర్టు తిరిగి ప్రారంభమైనప్పుడు వచ్చే వారం విచారణ జరగనుంది.అగ్నిపథ్ పథకంతో ఎయిర్ ఫోర్స్ ఔత్సాహికులు తమ కెరీర్ 20 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలకు తగ్గించారని పిటిషనర్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొన్నారు.


‘‘కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన అగ్నిపథ్ నోటిఫికేషన్‌ను రద్దు చేయాలనేది నా విజ్ఞప్తి.  70వేల మందికి పైగా యువత అపాయింట్‌మెంట్ లెటర్‌ల కోసం ఎదురుచూస్తున్నారు’’ అని న్యాయవాది ఎంఎల్ శర్మ చెప్పారు.గత నెలలో సాయుధ దళాల్లోకి ప్రవేశం కోసం అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ పథకాన్ని కేంద్రం ప్రారంభించింది.అగ్నిపథ్ పథకంపై సుప్రీంకోర్టు వచ్చే వారం ఇచ్చే తీర్పుపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. 


Updated Date - 2022-07-04T17:25:53+05:30 IST