కోటా పరిమితిపై మీ మాటేమిటి?

ABN , First Publish Date - 2021-03-09T10:06:29+05:30 IST

‘‘వెనకబడిన తరగతులకు రిజర్వేషన్లను 50 శాతానికే పరిమితం చేయడంపై మీ అభిప్రాయం ఏమిటి? ఇందిరా సహానీ కేసులో ఇచ్చిన తీర్పును మరింత విస్తృత ధర్మాసనానికి

కోటా పరిమితిపై మీ మాటేమిటి?

ఇందిరా సహానీ కేసు తీర్పును పునః పరిశీలించాలా?

50 శాతం కోటాపై విస్తృత ధర్మాసనానికి అప్పగించాలా?

మహారాష్ట్ర కోటా చట్టం సుప్రీం తీర్పునకు వ్యతిరేకమా?

బీసీలకు మీరు మేలు చేయకుండా ఆర్టికల్‌ 102 అడ్డుపడుతోందా?

నిర్దిష్ట కులం వెనకబడినదని ప్రకటించకుండా అడ్డుకుంటోందా?

అన్ని రాష్ట్రాలకూ సుప్రీం నోటీసులు.. విచారణ 15కు వాయిదా


న్యూఢిల్లీ, మార్చి 8: ‘‘వెనకబడిన తరగతులకు రిజర్వేషన్లను 50 శాతానికే పరిమితం చేయడంపై మీ అభిప్రాయం ఏమిటి? ఇందిరా సహానీ కేసులో ఇచ్చిన తీర్పును మరింత విస్తృత ధర్మాసనానికి అప్పగించాలా!? వెనకబడిన తరగతులకు లబ్ధి చేకూర్చే చట్టాలు చేయకుండా రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 102 మీకు అడ్డుకట్ట వేస్తోందా!?’’ అంటూ దేశంలోని అన్ని రాష్ట్రాలనూ సుప్రీంకోర్టు కోరింది. వీటితోపాటు రాజ్యాం గ సమాఖ్య విధానంపై 342ఏ అధికరణం ప్రభావం చూపిస్తోందా అని కూడా లిఖితపూర్వక జవాబు ఇవ్వాలని స్పష్టం చేసింది. సహానీ కేసు విచారణ సందర్భంగా 1992లో వెనకబడిన వర్గాలకు రిజర్వేషన్లు 50 శాతానికి మించి ఉండరాదంటూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ పరిమితిని పునః పరిశీలించాలని సుప్రీం కోర్టు భావిస్తోంది. అవసరమైతే కేసును మరింత విస్తృత ధర్మాసనానికి అప్పగించాలని యోచిస్తోంది. సామాజిక, ఆర్థిక పరిస్థితులు మారిన నేపథ్యంలో, వెనకబడిన వర్గాలకు రిజర్వేషన్‌ ఫలాలను రాష్ట్రాలు కల్పించగలవా? లేదా? అనే అంశా న్ని ధర్మాసనం పరిశీలించనుంది. నిజానికి, విద్య, ఉద్యోగాల్లో మరాఠాలకు 16 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 2018లో మహారాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసింది. అయితే, 16 శాతం కోటా ఇస్తే సుప్రీం కోర్టు నిర్దేశించిన 50 శాతం రిజర్వేషన్లను మించిపోతోందని, ఇది సమర్థనీయం కాదంటూనే.. ఉద్యోగాల్లో 12ు; విద్యలో 13ుకి మించి ఇవ్వరాదని సూచి స్తూ బోంబే హైకోర్టు ఆ చట్టాన్ని సమర్థించింది.


దీనిపై ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ నేతృత్వంలో జస్టిస్‌ లావు నాగేశ్వరరావు, జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌, జస్టిస్‌ హేమంత్‌ గుప్తా, జస్టిస్‌ ఎస్‌.రవీంద్ర భట్‌తో కూడిన ధర్మాసనం ముందుకు ఈ కేసు సోమవారం మరోసారి విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా, మహారాష్ట్ర కోటా బిల్లుపై న్యాయస్థానాలు ఎటువంటి తీర్పు ఇచ్చినా అది దేశవ్యాప్తంగా ఓబీసీ కోటాపై ప్రభావం చూపుతుందని, అందువల్ల, అన్ని రాష్ట్రాలనూ ఈ విచారణలో భాగస్వాములను చేయాలని, వాటి అభిప్రాయాలను కూడా తీసుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులు ముకుల్‌ రోహత్గీ, అభిషేక్‌ మను సింఘ్వి, ఇతర న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. విచారణ ఈనెల 15కి వాయిదా పడింది.

Updated Date - 2021-03-09T10:06:29+05:30 IST