Supreme Notices: ఎస్సీ వర్గీకరణపై కేంద్రానికి సుప్రీం నోటీసులు

ABN , First Publish Date - 2022-08-10T17:27:07+05:30 IST

ఎస్సీ వర్గీకరణపై కేంద్రానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.

Supreme Notices: ఎస్సీ వర్గీకరణపై కేంద్రానికి సుప్రీం నోటీసులు

న్యూఢిల్లీ: ఎస్సీ వర్గీకరణపై కేంద్రానికి సుప్రీం కోర్టు (Supreme court)నోటీసులు జారీ చేసింది. తెలుగు రాష్ట్రాలలో కూడా ఎస్సీ వర్గీకరణ (SC Classification)కు అనుమతివ్వాలంటూ సుప్రీంలో ఎమ్మార్పీఎస్ (MRPS) పిటీషన్ దాఖలు చేసింది. బుధవారం ఉదయం పిటీషన్‌పై ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ  (NV Ramana)ధర్మాసనం విచారణ జరిపింది. పంజాబ్, తమిళనాడులో ఎస్సీ వర్గకరణ కొనసాగుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలలో కూడా వర్గీకరణకు అనుమతి ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ పిటీషన్‌లో కోరింది. 2004లో ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు రద్దు చేసింది. 2004లో వర్గీకరణ అంశాన్ని విస్తృత ధర్మాసనానికి సుప్రీం ధర్మాసనం సిపారసు చేసింది. విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేసి ఎస్సీ వర్గీకరణపై శాశ్వత తీర్పు ఇవ్వాలని తాజా పిటీషన్‌లో ఎమ్మార్పీఎస్ కోరింది. ఎమ్మార్పీఎస్ పిటీషన్‌ను విచారణకు అంగీకరించిన సుప్రీం ధర్మాసనం... కేంద్రంతో పాటు ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. 

Updated Date - 2022-08-10T17:27:07+05:30 IST