ఉత్తరాఖండ్ విధ్వేష ప్రసంగాలపై సుప్రీం సీరియస్

ABN , First Publish Date - 2022-04-27T02:18:45+05:30 IST

ఈ బుధవారం ఉత్తరాఖండ్‌లోని రూర్కీలో జరగబోయే ధరమ్ సంసద్ కార్యక్రమంలో విధ్వేష ప్రసంగాలు రాకుండా చూడాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మంగళవారం సూచించింది. గతంలో జరిగిన ఇలాంటి ఒక కార్యక్రమంలో విధ్వేష ప్రసంగాలు చేయడంతో తీవ్ర పరిణామాలు ఏర్పడ్డాయని..

ఉత్తరాఖండ్ విధ్వేష ప్రసంగాలపై సుప్రీం సీరియస్

డెహ్రడూన్: ఈ బుధవారం ఉత్తరాఖండ్‌లోని రూర్కీలో జరగబోయే ధరమ్ సంసద్ కార్యక్రమంలో విధ్వేష ప్రసంగాలు రాకుండా చూడాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మంగళవారం సూచించింది. గతంలో జరిగిన ఇలాంటి ఒక కార్యక్రమంలో విధ్వేష ప్రసంగాలు చేయడంతో అసహజ పరిణామాలు ఏర్పడ్డాయని మరోసారి అలాంటివి పునరావృతం కాకుండా చూడాలని కోర్టు సూచించింది. ఈ విషయమై సుప్రీంలో దాఖలైన ఓ పిటిషన్‌ను విచారించిన సుప్రీం.. కొద్ది రోజుల క్రితమే ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని విరణ కోరింది. అయితే దీనికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం స్పందిస్తూ.. ఇలాంటి ఘటనలను ఆపలేమని, అక్కడ ఎలాంటి ప్రసంగాలు జరుగుతాయో ఊహించలేమని కోర్టుకు తెలిపింది. ఈ సమాధానంపై స్పందించిన జస్టిస్ ఏఎం ఖాన్‌విల్కర్, జస్టిస్ అభయ్ శ్నీనివాస్ ఓక, జస్టిస్ సీటీ రవికుమార్ నేతృత్వంలోని ధర్మాసనం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటివి జరక్కుండా మీరు నిరోధించాలి’’ అని ఉత్తరాఖండ్ డిప్యూటీ అడ్వకేట్ జనరల్ జతీందర్ కుమార్ సేథికి కోర్టు గట్టిగా సూచించింది.

Updated Date - 2022-04-27T02:18:45+05:30 IST