చంద్రబాబు ఆస్తులపై విచారణ కోరడానికి మీరెవరు?: లక్ష్మీ పార్వతికి సుప్రీం షాక్

ABN , First Publish Date - 2022-09-09T17:26:55+05:30 IST

సుప్రీంకోర్టు(Supreme Court)లో లక్ష్మీపార్వతి(Lakshmi Parvathi)కి చుక్కెదురైంది. టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) ఆస్తులపై విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది.

చంద్రబాబు ఆస్తులపై విచారణ కోరడానికి మీరెవరు?: లక్ష్మీ పార్వతికి సుప్రీం షాక్

Delhi : సుప్రీంకోర్టు(Supreme Court)లో లక్ష్మీపార్వతి(Lakshmi Parvathi)కి చుక్కెదురైంది. టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) ఆస్తులపై విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. చంద్రబాబు ఆస్తుల(Chandrababu Assets)పై విచారణ కోరుతూ.. లక్ష్మీపార్వతి దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.


చంద్రబాబు ఆస్తులపై విచారణ కోరడానికి మీరెవరని లక్ష్మీ పార్వతిని సర్వోన్నత న్యాయస్థానం(Supreme Court) ప్రశ్నించింది.


మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సతీమణి(NTR Wife)ని అని లక్ష్మీపార్వతి పేర్కొన్నారు.


ఎన్టీఆర్ సతీమణి అనేది అదనపు అర్హత అవుతుందా? అని ధర్మాసనం ప్రశ్నించింది.


ఒకరి ఆస్తులు తెలుసుకోవడానికి మీరెవరని ప్రశ్నించిన సుప్రీంకోర్టు 


హైకోర్టు అన్ని విధాలా ఆలోచించే పిటిషన్ కొట్టివేసిందన్న ధర్మాసనం 


ఎవరి ఆస్తులు.. ఎవరికి తెలియాలని ప్రశ్నించిన సర్వోన్నత న్యాయస్థానం


లక్ష్మీపార్వతి లేవనెత్తిన అంశంలో విలువ లేదని పిటిషన్‌ను డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు


గతంలో హైకోర్టు(High Court)లోనూ లక్ష్మీపార్వతికి చుక్కెదురైంది. హైకోర్టు తీర్పును సుప్రీం(Supreme Court)లో లక్ష్మీపార్వతి సవాలు చేశారు. చంద్రబాబు ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారనడానికి ఆధారాలు లేవని గతంలో ట్రయల్ కోర్టు(Trial Court), హైకోర్టులు తీర్పును వెలువరించాయి. చంద్రబాబుకు, లక్ష్మీపార్వతికి మధ్య రాజకీయ వైరం ఉందన్న విషయాన్ని కూడా గతంలో హైకోర్టు పరిగణలోకి తీసుకుంది. హైకోర్టు తీర్పు చాలా చక్కగా ఉందని న్యాయమూర్తులు దినేశ్ మహేశ్వరి(Dinesh Maheswari), బేలా త్రివేదీ(Bela Trivedi) ధర్మాసనం పేర్కొంది.



Updated Date - 2022-09-09T17:26:55+05:30 IST