Supreme Courtలో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు

ABN , First Publish Date - 2022-05-20T01:36:33+05:30 IST

సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది. అమరరాజా బ్యాటరీస్‌ యాజమాన్యంపై ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశించింది. కాలుష్య నియంత్రణ మండలి

Supreme Courtలో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు

సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది. అమరరాజా బ్యాటరీస్‌ యాజమాన్యంపై ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశించింది. కాలుష్య నియంత్రణ మండలి అమరరాజా బ్యాటరీస్ కంపెనీకి ఫిబ్రవరిలో జారీ చేసిన షోకాజ్ నోటీసుకు తదుపరి చర్యలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. నోటీసులపై చట్ట ప్రకారం ముందుకు వెళ్లవచ్చని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ...అమరరాజా యాజమాన్యం దాఖలు చేసిన పిటిషన్‌‌‌‌‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఏపీ ప్రభుత్వంతో పాటు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రధాన విద్యుత్ పంపిణీ కంపెనీకి ధర్మాసనం నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణ కొనసాగుతుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ హిమకోహ్లీతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తెలిపింది. 

Updated Date - 2022-05-20T01:36:33+05:30 IST