Nupur Sharma చిత్రాన్ని అప్‌లోడ్ చేసిన Surat వ్యాపారిని హతమారుస్తామంటూ బెదిరింపులు

ABN , First Publish Date - 2022-07-16T18:13:00+05:30 IST

నూపూర్ శర్మ చిత్రాన్ని అప్‌లోడ్ చేసినందుకు సూరత్ వ్యాపారవేత్తను హత్య చేస్తామని బెదిరించిన ఘటన...

Nupur Sharma చిత్రాన్ని అప్‌లోడ్ చేసిన Surat వ్యాపారిని హతమారుస్తామంటూ బెదిరింపులు

కేసు నమోదు...ముగ్గురు నిందితుల అరెస్ట్

సూరత్(గుజరాత్): నూపూర్ శర్మ చిత్రాన్ని అప్‌లోడ్ చేసినందుకు సూరత్ వ్యాపారవేత్తను హత్య చేస్తామని బెదిరించిన ఘటన గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరంలో తాజాగా వెలుగుచూసింది.సూరత్ నగరంలో అమ్యూజ్‌మెంట్ పార్క్ నడుపుతున్న శర్మ అనే వ్యక్తి నూపుర్ శర్మ ఫొటోను పార్క్ యొక్క ఇన్‌స్టాగ్రామ్ పేజీలో అప్‌లోడ్ చేశారు.దీంతో శర్మకు ఏడుగురు వ్యక్తుల నుంచి చంపేస్తానని బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు తెలిపారు.సూరత్ నగరానికి చెందిన మహ్మద్ అయాన్ అతాష్‌బాజివాలా, రషీద్ భురా, అలియా మహ్మద్ అనే ముగ్గురు నిందితులను అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు. 


ఈ కేసులో మరో నలుగురు నిందితుల కోసం అన్వేషణ కొనసాగుతోందని కేసు నమోదు చేసిన ఉమ్రా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ జేఆర్ చౌదరి తెలిపారు.ముగ్గురు నిందితులపై భారతీయ శిక్షాస్మృతి సెక్షన్లు 504,506, 507ల కింద కేసు నమోదు చేశారు.ఈ బెదిరింపులతో నూపుర్ శర్మ ఫొటోను తొలగించి,శర్మ క్షమాపణలు చెప్పాడు. అయితే అరెస్టు అయిన ముగ్గురూ, మరికొంత మంది ఇన్‌స్టాగ్రామ్‌లో అతన్ని చంపేస్తామని చెప్పి బెదిరించారు.ఈ నెల ప్రారంభంలో అహ్మదాబాద్‌కు చెందిన ఒక న్యాయవాది నూపుర్ శర్మకు మద్దతు ఇస్తూ పెట్టిన వాట్సాప్ స్టేటస్ మెసేజ్‌పై హత్య చేస్తామని బెదిరింపులు రావడంతో అతను పోలీసులను ఆశ్రయించారు.

Updated Date - 2022-07-16T18:13:00+05:30 IST