
వరుస ఫ్లాప్లతో సతమతమైన హీరో సూర్య `ఆకాశం నీ హద్దురా` సినిమాతో ఫామ్లోకి వచ్చాడు. ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రశంసలు అందుకుంది. త్వరలో సూర్య ఓ స్ట్రయిట్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడట. మాస్ చిత్రాల డైరెక్టర్ బోయపాటి శ్రీను ఈ సినిమాను తెరకెక్కిస్తారట.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు వీరిద్దరినీ కలిపేందుకు ప్రయత్నిస్తున్నారట. నేరుగా ఓ తెలుగు సినిమా చేయాలని సూర్య ఎప్పట్నుంచో అనుకుంటున్నాడు. బోయపాటి చెప్పిన హై వోల్టేజ్ యాక్షన్ స్టోరీ సూర్యకు నచ్చిందట. దీంతో ఆ సినిమాలో నటించేందుకు సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తారట. త్వరలోనే ఈ సినిమా గురించి ప్రకటన రాబోతున్నట్టు సమాచారం.