పదవీ బాధ్యతలు స్వీకరించిన సర్పంచులు

ABN , First Publish Date - 2021-03-06T06:09:09+05:30 IST

మండలంలోని ఇనిమెర్ల, దాదిరెడ్డిపల్లి, వగ్గంపల్లి, లక్ష్మినర్సాపురం, గ్రామ సర్పంచులుగా ఎన్నికైన సిద్దమైర్తి లక్ష్మినారాయణరెడ్డి, బద్దిపూడి శారమ్మ, మలినేని శ్రీనివాసులు, విజయశేఖర్‌లు శుక్రవారం నాయకులు అధికారుల సమక్షంలో సర్పంచులుగా బాధ్యతలు స్వీకరించారు.

పదవీ బాధ్యతలు స్వీకరించిన సర్పంచులు

పామూరు, మార్చి 5: మండలంలోని ఇనిమెర్ల, దాదిరెడ్డిపల్లి, వగ్గంపల్లి, లక్ష్మినర్సాపురం, గ్రామ సర్పంచులుగా ఎన్నికైన సిద్దమైర్తి లక్ష్మినారాయణరెడ్డి, బద్దిపూడి శారమ్మ, మలినేని శ్రీనివాసులు, విజయశేఖర్‌లు శుక్రవారం నాయకులు అధికారుల సమక్షంలో సర్పంచులుగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఇనిమెర్లలో జరిగిన కార్యక్రమంలో పలువురికి ఇళ్లపట్టాల పత్రాలను అందజేశారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు పార్టీలకు అతీతంగా అందించాలని వైసీపీ నాయకులు గంగసాని హుస్సేన్‌రెడ్డి సూచించారు. కార్యక్రమంలో కె రామిరెడ్డి, జడ్పీటీసీ అభ్యర్థి చప్పిడి సుబ్బయ్య, మాజీ వైస్‌ ఎంపీపీ పువ్వాడి రాంబాబు, డాక్టర్‌ కోటపాటి శ్రీనివాసులు, అంబటి కొండారెడ్డి, బద్దిపూడి మార్కుతో పాటు పంచాయతీల వార్డు సభ్యులు గ్రామస్థులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-06T06:09:09+05:30 IST