గంజాయి అక్రమ రవాణాపై నిఘా

ABN , First Publish Date - 2022-08-18T05:27:15+05:30 IST

జిల్లా లో గంజాయి అక్రమ రవాణా, వినియోగంపై నిరంతరం నిఘా పె ట్టా మని ఎస్పీ రెమారాజేశ్వరి అన్నారు.

గంజాయి అక్రమ రవాణాపై నిఘా
గంజాయి నిల్వలను దగ్ధం చేస్తున్న ఎస్పీ రాజేశ్వరి

ఎస్పీ రెమా రాజేశ్వరి8 గుమ్మలబావి దగ్గర గంజాయి నిల్వల నిర్వీర్యం

నార్కట్‌పల్లి, ఆగస్టు 17: జిల్లా లో గంజాయి అక్రమ రవాణా, వినియోగంపై నిరంతరం నిఘా పె ట్టా మని ఎస్పీ రెమారాజేశ్వరి అన్నారు. నిషేధిత గంజాయిని అక్రమంగా రవాణా చేసినా, విక్రయించినా, వినియోగించినా కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా మీదుగా కొంతకాలంగా అక్రమ రవాణాతో పట్టుబడిన 10క్వింటాళ్ల 48.355 కిలోల గంజాయి నిల్వలను కోర్టు ఉత్తర్వుల మేరకు బుధవారం నార్కట్‌పల్లి మండలం గుమ్మలబావి ఫైరింగ్‌ రేంజ్‌లో నిర్వీ ర్యం చేశారు. నిల్వలను ఒకచోటవేసి నిప్పంటించి దహనం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. వ్యసనాలకు బానిసై విలువైన జీవితాన్ని యువత నాశనం చేసుకోవద్దన్నారు. గంజాయి ఇతర మాదక ద్రవ్యాలకు అలవాటుపడకుండా పిల్లలపట్ల అప్రమత్తంగా మెలగాల్సిన బాధ్యత వారి తల్లిదండ్రులపైనా ఉందన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఆశ్వాక్‌, ఏసీబీ డీఎస్పీ రమేశ్‌, నల్లగొండ, మిర్యాలగూడ డీఎస్పీలు నరసింహారెడ్డి, పీ.వెంకటేశ్వర్‌రావు, డీటీసీ డీఎ్‌సపీ వెంకటేశ్వర్లు, ఆర్‌ఎ్‌సఐలు కల్యాణ్‌, రాజీవ్‌ ఉన్నారు.


Updated Date - 2022-08-18T05:27:15+05:30 IST