గ్రానైట్‌ అక్రమ రవాణాపై నిఘా !

ABN , First Publish Date - 2021-07-14T16:48:47+05:30 IST

గ్రానైట్‌ అక్రమ రవాణాపై..

గ్రానైట్‌ అక్రమ రవాణాపై నిఘా !

ఒకవైపు విజిలెన్స్‌ దాడులు.. పెరిగిన పోలీసుల తనిఖీలు

రెండు రోజులుగా కదలని వాహనాలు

అక్రమార్కులంతా గప్‌చుప్‌..


అద్దంకి: గ్రానైట్‌ అక్రమ రవాణాపై విజిలెన్స్‌, పోలీసు అధికారులు నిఘా పెంచారు. దీంతో దొడ్డి దారిన శ్లాబులను తరలించే లారీలు రెండు రోజుల నుం చి ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఇదే పంథాను వారు కొనసాగిస్తారా లేక రాజకీయ నాయకుల ఒత్తిడితో సడలి ంపునిస్తారా అన్న విషయం చర్చనీయాంశమైంది. గతం లో అద్దంకి ప్రాంతం నుంచి గ్రానైట్‌ అక్రమ రవాణా జో రుగా సాగింది. కొంతమంది ముఠాలుగా ఏర్పడి ఈ వ్యవ హారాన్ని సాగించారు. అప్పట్లో పోలీసు లు దీనిపై లోతైన విచారణ చేపట్టారు. పలువురిని అరెస్టు చేశారు. ఈ నేపథ్యం లో ఏడాది క్రితం ఎస్పీ ఆదేశాల మేరకు  బల్లికురవ, సంతమాగులూరు, మార్టూ రు మండలాల పరిధిలో పలుచోట్ల ప్ర త్యేక పోలీసు చెక్‌పోస్టులను ఏర్పాటు చే శారు. అక్కడి సిబ్బంది తొలుత ఒకింత కఠినంగా ఉన్నప్పటికీ ఆ తర్వాత చూసీచూడనట్లు వ్యవహరించారు. దీంతో రాజ కీయ అండదండలున్న గ్రానైట్‌ అక్రమ రవాణాదారులకు లైన్‌క్లియర్‌ అయ్యింది. అనంతరం పోలీస్‌ చెక్‌పోస్టులు పూర్తిగా ఎత్తివేశారు. 


అధికార పార్టీ నేతల కనుసన్నల్లో.. 

చెక్‌పోస్టులు లేకపోవడంతో బల్లికురవ, సంతమాగులూరు మండలాలలోని కొంతమంది అధికారపార్టీ నాయకులు ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. గ్రానైట్‌ అక్రమ రవాణా జోరు పెంచారు. వాహనాలను ఎలాంటి ఇబ్బందిలేకుండా ఎల్లలు దాటిస్తామని వ్యాపారులతో బే రాలు మాట్లాడుకొని వసూళ్ల దందా కొనసాగించారు. ఇది ఇటీవల తారస్థాయికి చేరింది. అదేసమయంలో పలు శాఖలకు గతంలో ఇచ్చిన నెలవారీ మామూళ్లను కూడా నిలిపివేసినట్లు తెలుస్తోంది. దీంతో అధికారులు దాడులు ప్రారంభించగా అక్రమ రవాణా ఏస్థాయిలో సాగుతుందో బయటపడుతోంది.  


అటు విజిలెన్స్‌.. ఇటు పోలీసులు 

విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ అధికారులు వారం రోజులుగా రాత్రి సమయాల్లో నిఘా పెట్టి గ్రానైట్‌ అక్రమ రవాణా చేస్తున్న లారీలను పట్టుకొని కేసులు నమోదు చేస్తున్నారు. గత రెండు రోజుల నుంచి బల్లికురవ, సంతమాగులూరు మండలాల పరిధిలో రాత్రి సమయంలో పోలీసు అధికారులు నిఘా పెంచారు. దీంతో ప్రస్తుతం గ్రానైట్‌ శ్లాబులను అక్రమంగా రవాణా చేసే ముఠాలను లారీలను ఎక్కడికక్కడ నిలిపివేశారు. గ్రానైట్‌ శ్లాబుల లారీల వద్ద వసూళ్ల దందాకు అలవాటు పడిన రెండు మండలాల్లోని రాజకీయ నాయకులు తమ వైఖరి మా ర్చుకొని అక్రమ రవాణా దందా నుంచి పక్కకు  తప్పుకుంటారా లేక ఆయా శాఖల అధికారులను  ప్రసన్నం చేసుకొని మరలా కొనసాగిస్తారా అన్న విషయం చర్చనీయాంశంగా మారింది. 


చెక్‌పోస్టులు మళ్లీ ఏర్పాటు చేసేనా..?

గ్రానైట్‌ అక్రమ రవాణాను అరికట్టేందుకు గత ఏడాది పోలీసు అధికారులు ప్రత్యేకంగా చెక్‌ పోస్టులు  ఏర్పాటు  చేయటంతో ఇతర ప్రాంతాలకు అనధికారికంగా తరలిపో యే గ్రానైట్‌ శ్లాబుల రవాణాకు కొంత మేర అడ్డుకట్ట పడింది. కానీ కారణం ఏదైనా ఆతర్వాత వాటిని  ఎత్తివే శారు. దీంతో మళ్లీ అక్రమ రవాణా జోరు పెరిగింది. ఈ నేపథ్యంలో మరలా  చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీ లు కట్టుదిట్టం చేస్తే ప్రభుత్వానికి నెలవారీ రూ.కోట్ల ఆ దాయం సమకూరే అవకాశం ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి పోలీస్‌ చెక్‌పోస్టుల ఏర్పాటుపై దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. 


అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు

గ్రానైట్‌ శ్లాబులు, బ్లాకులను అనుమతి పత్రాలు లే కుండా రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు  తీసుకుం టాం. అక్రమ రవాణాపై ఎవరు సమాచారం అందించి నా వెంటనే తనిఖీలు చేసి లారీలను స్వాధీనం చేసు కుంటాం. గ్రానైట్‌ క్వారీలు, ఫ్యాక్టరీల యజమానులు అక్రమ రవాణాదారులను ప్రోత్సహించవద్దు. దళారుల మాటలు నమ్మి వారికి సహకరిస్తే అందుకు శిక్ష అను భవించాల్సి ఉంటుంది. 

- రాజే్‌ష, అద్దంకి సీఐ

Updated Date - 2021-07-14T16:48:47+05:30 IST