ఆస్పత్రులపై నిఘా!

ABN , First Publish Date - 2022-05-09T06:58:36+05:30 IST

జిల్లాకేంద్రంతో పాటు భైం సా, ఖానాపూర్‌లోని ప్రభుత్వాసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందడం లేదన్న ఆరోపణల నేపథ్యంలో కలెక్టర్‌ సీరియస్‌ చర్యలు చేపట్టారు. దీని కోసం గానూ ఆయన ప్రత్యేక యాక్షన్‌ ప్లాన్‌ను రూపొందించి ఆకస్మిక తనిఖీల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వా రం రోజుల నుంచి పర్యటిస్తున్నారు.

ఆస్పత్రులపై నిఘా!
నిర్మల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలోని మెటర్నిటీ విభాగానికి తాళం వేస్తున్న సిబ్బంది (ఫైల్‌)

సేవల నాణ్యతపై కలెక్టర్‌ ఆరా  

నార్మల్‌ డెలివరీల వివరాల సేకరణ 

పరిశుభ్రత, రోగుల సేవలకు ప్రాఽధాన్యం ఇవ్వాలంటూ ఆదేశాలు 

ఆకస్మిక తనిఖీలు

నిర్మల్‌, మే 8 (ఆంధ్రజ్యోతి): జిల్లాకేంద్రంతో పాటు భైం సా, ఖానాపూర్‌లోని ప్రభుత్వాసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందడం లేదన్న ఆరోపణల నేపథ్యంలో కలెక్టర్‌ సీరియస్‌ చర్యలు చేపట్టారు. దీని కోసం గానూ ఆయన ప్రత్యేక యాక్షన్‌ ప్లాన్‌ను రూపొందించి ఆకస్మిక తనిఖీల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వా రం రోజుల నుంచి పర్యటిస్తున్నారు. 

ముఖ్యంగా ప్రభుత్వాసుపత్రుల్లో రోగులకు అందుతున్న సేవలు, ఆసుపత్రుల్లోని పరిశుభ్రత వాతావరణం, తాగునీటి సౌక ర్యం వంటి అంశాలపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. కొద్దిరోజుల్లోనే నాణ్యత ప్రమాణాలకు సంబంధించిన కేంద్ర బృందాలు జిల్లాలో పర్యటించనున్న కారణంగా ఆయన ఈ అంశానికి ప్రాధాన్యతనిస్తూ ఆసుపత్రుల పనితీరు మెరుగు పడే విఽదంగా చర్యలు చే పట్టారు. కొద్దిరోజుల క్రితం నార్మల్‌ డెలవరీలు చేయడం లేదని సీజేరియన్‌లు ఎక్కువగా చేస్తున్నారన్న ఆరోపణలపై వైద్యారోగ్య శాఖ పలు ప్రైవేటు ఆసు పత్రుల్లోని గైనకాలజీ విభాగాలను సీజ్‌ చేసిన సంగతి తెలిసిందే.  ఆ తర్వాత కలెక్టర్‌ ఇటు ప్రభుత్వ , అ టు ప్రైవేటు ఆసుపత్రులకు నార్మల్‌ డెలివరీల విషయంలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు ఓ మెట్టు దిగి వచ్చి నార్మల్‌ డెలివరీలకు ప్రాఽధాన్యతనిస్తామని, ఇక నుం చి సర్జరీల సంఖ్య తగ్గిస్తామని కలెక్టర్‌కు హామీనిచ్చారు. డెలవరీ కోసం వచ్చే గర్భిణులకే కాకుండా వారి కు టుంబ సభ్యులకు నార్మల్‌ డెలివరీలపై అవగాహన కల్పించాలని కలెక్టర్‌ సూ చించారు. దీనికి ప్రైవేటు డాక్టర్‌లు అంగీకరించడమే కాకుండా ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రభు త్వ ఆసుపత్రుల్లో కూడా సీజేరియన్‌ ల సంఖ్యను తగ్గించేందు కోసం సం బంధిత డాక్టర్‌లతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. రెండు రోజుల క్రితం ప్రభుత్వ, ప్రైవేటు డాక్టర్‌లతో కలెక్టర్‌ మరోసారి స మీక్ష సమావేశం నిర్వహించి ఆసు పత్రుల్లో నాణ్యత ప్రమాణాలు, మె రుగైన వైద్య సేవలు, రోగులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించ డం వంటి అంశాలపై దిశా నిర్దే శం చేశారు. ఈ సమావేశాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం అధిక ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. 

నాణ్యత ప్రమాణాలపైనే ప్రత్యేక దృష్టి

నేషనల్‌ క్వాలిటీ ఆశిరెన్స్‌ ప్రోగ్రాంకు సం బంధించిన ఉన్నతాధికారులు జిల్లాలో పర్యటించి దానికి అనుగుణంగా ర్యాంకింగ్‌లు ప్ర కటించే అవకాశం ఉన్న కారణంగా కలెక్టర్‌ దీనికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అత్యఽధిక ర్యాంకింగ్‌ వచ్చే ఆస్పత్రులకు కేంద్రం ద్వారా నిధులు వచ్చే అవకాశం ఉంటాయి. దీంతో పీహెచ్‌సీలు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లలో నాణ్యత ప్రమాణాల విషయంలోనే దృష్టి పె డుతున్నారు. ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇ స్తూ నాణ్యత ప్రమాణాలకు ప్రాధాన్యతనివ్వాలంటూ ఆదేశిస్తున్నారు. దీని కారణంగా ఆస్పత్రుల పరిసరాలన్నీ మారిపోతున్నాయి. రోగులు ఆస్పత్రులకు రాగానే ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించేలా చర్యలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా స్టేట్‌ క్వా లిటీ కన్సల్టెంట్‌ నాణ్యత ప్రమాణాలపై ప్రొ జెక్టర్‌ ద్వారా వివరిస్తున్నారు.

నార్మల్‌ డెలివరీలే టార్గెట్‌గా...

కలెక్టర్‌ మొదటి నుంచి ప్రభుత్వాసుపత్రులతో పాటు ప్రైవేటు ఆసుపత్రుల్లో నార్మల్‌ డెలివరీలు ఎక్కువగా చేయాలంటూ హెచ్చరిస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఇప్పటి వరకు 25 శాతమే సాధారణ ప్రసవాలు జరిగాయని, ఈసంఖ్యను రెట్టింపు చేయా లంటూ ఆయన డాక్టర్‌లకు సూచిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఏర్పాటు చేసిన సాధారణ ప్రసవాల కమిటీ ఇది దిశగా దృష్టి సారించాలంటూ ఆదేశిస్తున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో 42 శాతం నార్మల్‌ డెలివరీలు జరుగుతున్న అంశాన్ని కలెక్టర్‌ పరిగణలోకి తీసుకొని 75 లక్ష్యం పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కోరుతున్నారు. నార్మల్‌ డెలివరీల విషయంలో ప్రైవేటు డాక్టర్‌లు, ప్రభుత్వ డాక్టర్‌లు నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరిస్తున్నారు. 

కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీలు..

జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ ప్రభుత్వాసుపత్రులను ఆకస్మికంగా తనిఖీ చేస్తున్నారు. ఆసుపత్రుల్లో గ్లీనరీ, పెయింటింగ్స్‌, లైటింగ్స్‌కు ప్రాఽధాన్యత కల్పించాలంటూ చిన్న చిన్న మరమ్మతు వెంటనే పూర్తి చేయా లని ఆదేశిస్తున్నారు. అయితే కలెక్టర్‌ ఎవరికీ సమాచారం ఇవ్వకుండా ఆ కస్మికంగా తనిఖీలు చేస్తూ కేంద్ర నాణ్యత ప్రమాణాల కమిటీ ద్వా రా ఏ గ్రేడ్‌ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగానే ఆయన ఇటు ప్రభుత్వ  అటు ప్రైవేటు ఆసుపత్రులను తనిఖీలు చేసి లక్ష్య సాధన కోసం దిశా నిర్దేశం చేస్తున్నారు. మొదటి నుంచి కలెక్టర్‌ వైద్య రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టడమే కాకుండా ఆసుపత్రుల్లో డాక్టర్‌లు, సిబ్బంది హాజరుపైనా, వారి పనితీరుపైనా నిఘా సారిస్తున్నారు. ఆసుపత్రుల్లో లైవ్‌ లోకేషన్‌ అటండెన్స్‌ను అ మలు చేస్తూ వారంతా విధులకు సక్రమంగా హాజరయ్యేట్లు చూస్తున్నారు. మొత్తానికి జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ దవాఖానలల్లో పరిశుభ్రత, మెరుగైన వైద్యం కోసం కలెక్టర్‌ ప్రయత్నిస్తున్నారు. 

Read more