జిల్లాలో అత్యాధునిక నిఘా వ్యవస్థ

ABN , First Publish Date - 2022-07-06T04:59:46+05:30 IST

జిల్లాలో అత్యాధునిక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశామని ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌ అన్నారు.

జిల్లాలో అత్యాధునిక నిఘా వ్యవస్థ

- ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌

- కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ప్రారంభం

గద్వాల క్రైం, జూలై 5 : జిల్లాలో అత్యాధునిక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశామని ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌ అన్నారు. ఆధునిక సీసీ కెమెరాలతో నిఘా, భద్రతలను పర్యవేక్షించనున్నామని తెలి పారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను మంగళ వారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయ న మాట్లాడుతూ జిల్లాలోని పట్టణాలు, గ్రామాల్లో ఏర్పాటు చేసిన అన్ని సీసీ కెమరాలను కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానం చేసినట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలోని సీసీ కెమెరాల దృశ్యాలను ఇక్కడి నుండే పర్యవేక్షిస్తామన్నారు. దీని ద్వారా ట్రాఫిక్‌ రూల్స్‌ ను ఉల్లంఘించిన వారి వాహనాలకు ఆటో మెటిక్‌గా చలానా జనరేట్‌ అవుతుందని తెలిపారు. ప్రతీ ఒక్కరు ట్రాఫిక్‌ నిబంధనలను పాటిం చాలని, డ్రైవింగ్‌ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ వాహనం నడుపొద్దని చెప్పారు. కార్యక్రమంలో డీఎస్పీ రంగస్వామి, గద్వాల, అలంపూర్‌, శాంతి నగర్‌ సీఐలు చంద్రశేఖర్‌, సూర్యనాయక్‌, శివశంకర్‌గౌడు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-07-06T04:59:46+05:30 IST