ముమ్మరంగా ఇంటింటి సర్వే

ABN , First Publish Date - 2021-05-07T04:24:36+05:30 IST

కరోనా రెండో ఉధృతి విజృంభిస్తోంది. వ్యాధి తీవ్రత వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రస్తుతం కొంతమంది తమకు కరోనా లక్షణాలు ఉన్నా ఆసుపత్రికి వెళ్లకుండా ఇంట్లో ఉంటున్నారు.

ముమ్మరంగా ఇంటింటి సర్వే
మల్లాయిగూడెంలో ఇంటింటి సర్వే చేస్తున్న సిబ్బంది, ప్రజాప్రతినిధులు

ప్రజల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న ప్రత్యేక బృందాలు

అనుమానితులకు కరోనా నిర్ధారణ పరీక్షలు

నెట్‌వర్క్‌: కరోనా రెండో ఉధృతి విజృంభిస్తోంది. వ్యాధి తీవ్రత వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రస్తుతం కొంతమంది తమకు కరోనా లక్షణాలు ఉన్నా ఆసుపత్రికి వెళ్లకుండా ఇంట్లో ఉంటున్నారు. వ్యాధిని ముదరబెట్టుకుని నానా ఇబ్బందులు పడుతున్నారు. దీని వల్ల ప్రాణాల మీదకు రావడంతో పాటు కరోనా వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. దీంతో ఊహించని విధంగా ప్రతీ ప్రాంతంలోనూ కరోనా సెకండ్‌ వేవ్‌ తన ప్రతాపాన్ని చూపుతోంది. ఈనేపఽథ్యంలో ప్రభుత్వం కరోనాపై ఇంటింటి సర్వేను చేపట్టింది. సర్వేలో ప్రాథమిక లక్షణాలు కనిపిస్తే వెంటనే కరోనా చికిత్సకు అవసరమయ్యే కిట్‌ పంపిణీకి శ్రీకారం చు ట్టింది. ఇందులో భాగంగా అశ్వారావుపేట మండలంలో ఇంటింటి సర్వే కోసం 70 బృందాలను ఏర్పాటు చేసినట్టు తహసీల్దార్‌ చల్లా ప్రసాదరావు తెలిపారు. ప్రతీ బృందంలో వీఆర్‌వో, వీఆర్‌ఏ, పంచాయతీ కార్యదర్శి, ఏఎన్‌ఎం, ఆశ, అంగన్‌వాడీ కార్యకర్తలు, వీవో, ఇతర సిబ్బంది ఉంటారని ఆయన తెలిపారు. ఈ బృందాలు ప్రతి రోజు ఇంటింటి సర్వే చేస్తారు. ఇల్లిల్లూ తిరిగి అందులో సభ్యుల వివరాలు, ఎవరైనా జ్వరం, దగ్గు, జలుబు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అనే వివరాలను నమోదు చేసుకుంటున్నారు. అశ్వారావుపేట, పేరాయిగూడెంలో జరిగిన సర్వేలో స్వయంగా తహసీల్దార్‌ చల్ల ప్రసాద్‌ పాల్గొని సిబ్బందికి తగు సూచనలు చేశారు. అనుమానితులు సత్వరమే చికిత్సను పొందేలా అవగాహన కల్పించాలని ఆయన సర్వే బృందంలోని అధికారులకు సూచించారు. 

మెడికల్‌ కిట్ల కొరత

మొదటి రోజు మెడికల్‌ కిట్‌లు తగినంత అందుబాటు లో లేకపోవడంతో సర్వేలో జ్వరం లక్షణాలు ఉన్నవారందరికీ పంపిణీ చేయలేదని తెలుస్తోంది. సర్వేలో బాధితులను గుర్తించి వివరాలను నమోదు చేసుకున్నారు. శుక్రవారం నాటికి కిట్‌లు వస్తాయని భావిస్తున్నారు. 

బూర్గంపాడులోని గౌతపురం కాలనీలో నిర్వహించిన కార్యక్రమంలో తహసీల్దార్‌ భగవాన్‌రెడ్డి పాల్గొని వివరాలు నమోదు చేశారు. కాలనీలోని ప్రతి ఇంటికి తిరిగి వారి ఆ రోగ్య పరిస్ధితిపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ స్వప్న, ఎంపీడీవో వివేక్‌రామ్‌, పీహెచ్‌సీ వైద్యురాలు స్పందన పాల్గొన్నారు

మణుగూరులో గురువారం వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహించారు. సర్వేలో భాగంగా ప్రతి ఇంటిలో వ్యక్తుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. జ్వరంగా ఉంటే థర్మల్‌ స్కానర్‌, పల్స్‌ ఆక్సీమీటర్‌లతో పరీక్షించారు. అనుమానం ఉన్న వ్యక్తులకు కొవిడ్‌ కేంద్రానికి తరలించి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. దగ్గు, జలుబు, సాధారణ జ్వరంగా ఉన్న వ్యక్తులకు అవసరమైన మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల సర్పంచ్‌లు, వైద్య సిబ్బంది కరోనా నేపథ్యంలో ప్రతీ ఒక్కరు తప్పక మాస్క్‌ ధరించాలని సూచించారు. కార్యక్రమంలో సీహెచ్‌వో వెంకటేశ్వర్లు, వైద్య సిబ్బంది దయామ ని, రాంప్రసాద్‌, యశోద, భవాని, దుర్గ, లక్ష్మీ, స్రవంతి, కూనవరం సర్పంచ్‌ ఏనిక ప్రసాద్‌, సాంబాయిగూడెం సర్పంచ్‌ కాయం తిరుపతమ్మ, రామానుజవరం సర్పంచ్‌ సతీష్‌ పాల్గొన్నారు. 

దుమ్ముగూడెం మండల పరిధిలోని నరసాపురం పీ హెచ్‌సీని జిల్లా అదనపు కలెక్టర్‌ దురిశెట్టి అనుదీప్‌ గు రువారం సందర్శించారు. పీహెచ్‌సీ పరిధిలో జరుగుతున్న కొవిడ్‌-19 పరీక్షలు, వ్యాక్సినేషన్‌ వివరాలను వైద్యాధికారి జితేంద్రను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కె. దంతె నంలో జరుగుతున్న ఇంటింటి ఆరోగ్య సర్వేను పరి శీలిం చారు. సర్వేలో ప్రతీ ఒక్క ఇంటినీ వదలకుండా వివరాలు సేకరించి మందులను అందజేయాలని సూచించారు. సర్వే కు సంబంధించి పలు సూచనలు, సలహాలను తెలిపారు. కా ర్యక్రమంలో ఇన్‌చార్జ్‌ ఎంపీడీవో ముత్యాలరావు, తహసీల్దార్‌ రవికుమార్‌ పాల్గొన్నారు. 

పాజిటివ్‌ కేసులు ఎక్కువగా నమోదవుతున్న సింగా రంలో గురువారం కొవిడ్‌-19 కట్టడిపై వైద్యాధికారి బాలా జీనాయక్‌ అవగాహన సమావేశం నిర్వహించారు. లక్షణా లున్నవారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ, మెడికల్‌ కిట్లను అందజేశారు. ఇప్పటికే సింగారం గ్రామస్థులు స్వచ్ఛంద లాక్‌డౌన్‌ పాటిస్తున్నారు. పెళ్లి వేడుకలను నిరాడంబరంగా జరుపుకోవాలని సర్పంచ్‌, ప్రజాప్రతి నిదులు వరుడికి అవగాహన కలిగించారు. కార్యక్రమంలో సర్పంచి కొండయ్య, ఎంపీటీసీ నాగలక్ష్మి పాల్గొన్నారు.

దమ్మపేట మండల పరిధిలోని గున్నేపల్లి, గణేష్‌పాడు, మొద్దులగూడెంలో కొవిడ్‌పై అవగాన కల్పిస్తూ గురువారం తహసీల్ధార్‌  మస్తాన్‌రావు ఆధ్యర్యంలో ఇంటింటి సర్వే నిర్వహించారు. ఒక్కోక్క గృహంలో ఎంత మంది నివసిస్తున్నారు. ప్రస్తుతం ఎంతమంది జ్వరంతో బాధపడుతున్నారు, కొవిడ్‌ లక్షణాలు ఏమైనా ఉన్నాయా అంటూ వివరాలు సేకరించారు. 

అన్నపురెడ్డిపల్లి, ఎర్రగుంట, భీమునిగూడెం, రాజాపురంలో గురువారం ఇంటింటి సర్వే నిర్వహించారు. ఈకార్యక్రమంలో తహసీల్దార్‌ భద్రకాళి, ఎంపీడీవో రేవతి వైద్యసిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-05-07T04:24:36+05:30 IST