గెజిట్‌ జారీ చేయకుండా సర్వే సరికాదు: కుడుదుల

ABN , First Publish Date - 2022-01-21T07:31:51+05:30 IST

గెజిట్‌ జారీ చేయకుండా రీజినల్‌ రింగ్‌ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌) నిర్మాణం కోసం సర్వే చేయడం, హద్దురాళ్లు నాటడం సరికాదని జడ్పీ కాంగ్రెస్‌ ఫ్లోర్‌ లీడర్‌ కె.నగేష్‌ అన్నారు.

గెజిట్‌ జారీ చేయకుండా సర్వే సరికాదు: కుడుదుల
సమావేశంలో మాట్లాడుతున్న కుడుదుల నగేష్‌

భువనగిరి టౌన్‌, జనవరి 20: గెజిట్‌ జారీ చేయకుండా రీజినల్‌ రింగ్‌ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌) నిర్మాణం కోసం సర్వే చేయడం, హద్దురాళ్లు నాటడం సరికాదని జడ్పీ కాంగ్రెస్‌ ఫ్లోర్‌ లీడర్‌ కె.నగేష్‌ అన్నారు. భువనగిరిలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాణంకోసం చేసే భూసేకణపై ముందుగా రైతులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ను పర్యావరణహితంగా నిర్మిస్తామని పేర్కొన్న ప్రభుత్వమే మాట మార్చిందన్నారు. కరోనా సాకుతో ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వడం తగదని, ఈ నిర్ణయంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. 1వ తరగతి నుంచి ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెడుతున్నట్లు ప్రభుత్వం చేసిన ప్రకటన హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇంగ్లీష్‌ బోధనపై ఉపాధ్యాయులకు కనీస అవగాహన కల్పించకుండానే ఇంగ్లీష్‌  మీడియం ప్రారంభించడం సాధ్యమా అని ప్రశ్నించారు. కొవిడ్‌ విజృంభిస్తున్నా వైద్యసేవలు మెరుగుపర్చడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. సమావేశంలో పీసీసీ మాజీ కార్యదర్శి తంగెళ్లపల్లి రవికుమార్‌, ఎండీ. సలాఉద్దీన్‌, తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-01-21T07:31:51+05:30 IST