61,285 కుటుంబాల్లో సర్వే

ABN , First Publish Date - 2022-01-23T05:32:53+05:30 IST

61,285 కుటుంబాల్లో సర్వే

61,285 కుటుంబాల్లో సర్వే

వికారాబాద్‌/మేడ్చల్‌, జనవరి 22 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : వికారాబాద్‌ జిల్లాలో  నిర్వహిస్తున్న ఫీవర్‌ సర్వేలో రెండు రోజుల్లో 61,285 ఇళ్లలో నివసిస్తున్న వారి ఆరోగ్య సమాచారం సేకరించారు. సర్వే నిర్వహించిన కుటుంబాల్లో 2882 మందికి  అనుమానిత లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. జిల్లాలో 2,20,301 గృహాలు ఉండగా, 741 బృందాలు ఫీవర్‌ సర్వే నిర్వహిస్తున్నాయి. శనివారం 34,981 గృహాల్లో సర్వే నిర్వహించి వారిలో 1,632 మందికి అనుమానిత లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. లక్షణాలు ఉన్న వారిలో 310 మందికి కొవిడ్‌ పరీక్షలు  చేసుకోవాలని సూచించారు. జ్వర లక్షణాలు ఉన్న వారికి మందులు అందజేశారు. ఇదిలా ఉంటే, వ్యాక్సినేషన్‌లో భాగంగా 15-18 ఏళ్లలోపు వారిలో 260 మందికి కొవిడ్‌ మొదటి డోస్‌ వేయగా, 18 ఏళ్లు పైబడిన వారిలో మొదటి డోస్‌ 163 మందికి, రెండవ డోస్‌ 3,830 మందికి వేశారు. కాగా మేడ్చల్‌ జిల్లాలో రెండో రోజులుగా 74,126 గృహాల్లో జ్వర సర్వే నిర్వహించారు. అందేలె 4,249 మందికి  మెడికల్‌ కిట్లు పంపిణీ చేశారు. శనివారం  గ్రామ పంచాయతీల్లో 4,330 గృహాల్లో సర్వేలు నిర్వహించి 63 మందికి  మెడికల్‌ కిట్లు పంపిణీ చేశారు. 13 లోకల్‌ అర్బన్‌ బాడీస్‌లో  44,082 గృహాలల్లో సర్వేలు నిర్వహించి 1,044 మందికి  మందులు  పంపిణీ చేశారు.  జిల్లా జీహెచ్‌ఎంసీ పరిధిలో 25,714  ఇళ్లలో సర్వే నిర్వహించి 2,088  మందికి మెడికల్‌  కిట్లను పంపిణీ చేశారు.  కాగా జిల్లాలోని ఆస్పత్రుల్లో మరో 1,054  మందికి  మెడికల్‌ కిట్లను అందించినట్లు జిల్లావైద్యాధికారి మల్లికార్జున్‌రావు తెలిపారు.

Updated Date - 2022-01-23T05:32:53+05:30 IST