కాలువ కబ్జాపై సర్వే

ABN , First Publish Date - 2021-01-22T05:17:35+05:30 IST

ప్రొద్దుటూరులో నేషనల్‌ హైవే రింగ్‌ రోడ్డు వెంబడి ఉన్న మైలవరం ఉత్తర కాలువకు చెందిన కల్లూరు డిస్ర్టిబ్యూటరీ చానల్‌ను పూడ్చి కబ్జా చేసి ఇరిగేషన్‌ భూముల విక్రయాలు జరపడంపై ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రికలో గురువారం ప్రచురితమైన కఽథనంపై జాయింట్‌ కలెక్టర్‌ గౌతమి స్పందించారు.

కాలువ  కబ్జాపై సర్వే

రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారుల జాయింట్‌ ఇన్‌స్పెక్షన

ఆంధ్రజ్యోతి కఽథనానికి స్పందించిన జాయింట్‌ కలెక్టర్‌

ప్రొద్దుటూరు అర్బన్‌, జనవరి 21 : ప్రొద్దుటూరులో నేషనల్‌ హైవే రింగ్‌ రోడ్డు వెంబడి ఉన్న మైలవరం ఉత్తర కాలువకు చెందిన కల్లూరు డిస్ర్టిబ్యూటరీ చానల్‌ను పూడ్చి కబ్జా చేసి ఇరిగేషన్‌ భూముల విక్రయాలు జరపడంపై ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రికలో గురువారం ప్రచురితమైన కఽథనంపై జాయింట్‌ కలెక్టర్‌ గౌతమి స్పందించారు. ఆ మేరకు తహసీల్దారు నజీర్‌ అహ్మద్‌కు పత్రికా కఽథనాలను జేసీ వాట్సప్‌ ద్వారా పంపి వెంటనే కబ్జా అయిన ఇరిగేషన్‌ కాలువను సర్వే చేసి హద్దులు గుర్తించాలని ఆదేశించారు. పూడ్చిన కాలువను యంత్రాల సహాయంతో కాలువ యఽథాతధ స్థితికి తీసుకురావాలన్నారు. పోలీసు ఫోర్స్‌ను సైతం తీసుకుని యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎక్కడెక్కడ ఎవరెవరు కాలువను కబ్జాచేశారో వివరాలతో సహా నివేదిక ఇవ్వాలని కోరారు.


భూముల కబ్జాను ఉపేక్షించం : తహసీల్దారు నజీర్‌ అహ్మద్‌

ప్రభుత్వ భూములను ఎవరు కబ్జా చేసినా ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దారు నజీర్‌అహ్మద్‌ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మైలవరం ఉత్తర కాలువకు చెందిన కల్లూరు డిస్ర్టిబ్యూటరీ చానల్‌ కబ్జాపై గత నవంబరు, డిసెంబరు నెలల్లో ఇరిగేషన్‌ అధికారులు సర్వే చేయమని వినతులు ఇచ్చారన్నారు. కానీ ఇంటి స్ధలాల పంపిణీ కార్యక్రమాల వల్ల సర్వే చేయడానికి సమయం ఇవ్వలేకపోయామన్నారు. జాయింట్‌ ఇన్‌స్పెక్షనకు తేదీలు ఖరారు చేయమని ఇరిగేషన్‌ అధికారులను కోరామని చెప్పారు. వారు తేదీలు ఖరారు చేయలేదు. పత్రికా కథనాలకు స్పందించిన జేసీ గౌతమి ఆదేశాలతో ఇరిగేషన్‌ అధికారులను పిలిపించి వారి వద్ద ఉన్న రికార్డులను సిద్ధం చేసుకోమని తెలిపామన్నారు. శుక్రవారం ఉదయమే జాయింట్‌ సర్వేను చేపడుతున్నామన్నారు. కాలువ రికార్డుల మేరకు ఎక్కడెక్కడ కబ్జాకు గురి అయిందో తేల్చుతామన్నారు. పూడ్చిన కాలువను తిరిగి యంత్రాలతో పునరుద్ధరిస్తామన్నారు. హద్దులు తేల్చిన తరువాత కాలువను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఇరిగేషన్‌ అధికారులదే అన్నారు. ఇరిగేషన అధికారులు ఏఈలు వీరయ్య, సర్వేశ్వరరెడ్డిలు రికార్డులు తీసుకుని తహసీల్దారుతో సమావేశమయ్యారు. సర్వేయర్లు గురివిరెడ్డి, వెంకటేశ్వర్లు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Updated Date - 2021-01-22T05:17:35+05:30 IST