బడి బయట పిల్లలపై సర్వే

ABN , First Publish Date - 2021-01-16T06:09:23+05:30 IST

కరోనా నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్నాయి. అయితే చాలా మంది పిల్లలు పాఠశాలలో వినకుండా వ్యవసాయ పనులకు వెళ్తున్నారు. వీరితో పాటు బడికి దూరంగా ఉన్న వారి వివరాలు సేకరిస్తున్నారు.

బడి బయట పిల్లలపై సర్వే
జల్లాపల్లిలో సర్వే చేస్తున్న సీఆర్పీలు

బోధన్‌, జనవరి 15: కరోనా నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్నాయి. అయితే చాలా మంది పిల్లలు పాఠశాలలో వినకుండా వ్యవసాయ పనులకు వెళ్తున్నారు. వీరితో పాటు బడికి దూరంగా ఉన్న వారి వివరాలు సేకరిస్తున్నారు. ఈ నెల 28లోగా సర్వే జాబితా ఖరారు చేయాలని భావిస్తున్నారు. జిల్లాలో దివ్యాంగ పిల్లలను గుర్తించేందుకు  ఐ ఆర్పీలు, బాల కార్మికులు, బడికి వెళ్లని వారి కోసం సీఆర్పీలు సర్వే నిర్వహిస్తున్నారు. విద్యార్థుల సమగ్ర సమాచారాన్ని సేకరించి ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేయనున్నారు. అధికారుల సర్వేలో జిల్లాలో బడి బయటి పిల్లల సంఖ్య తేలనుంది. మండలాల వారీగా సీఆర్పీలు బడి బయట పిల్లలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.
28 అంశాలతో సమాచార సేకరణ
బడి బయటి పిల్లల సమగ్ర సమా చారాన్ని సిబ్బంది నమోదు చేస్తున్నా రు. విద్యార్థి పేరు, ఆధార్‌సంఖ్య, పుట్టి న తేదీ, వయసు, చరవాణి, కుటుంబ సభ్యుల జీవనాధారం, స్వశక్తి సంఘంలో సభ్యులుగా ఉన్నారా? కులం, విద్యాస్థితి, ఏ తరగతిలో మానేశారు? వలస వచ్చిన వారా? తదితర 28 అంశాలతో కూడిన వివ రాలు సేకరిస్తున్నారు. ఐఆర్పీలు, సీఆర్పీలు పట్టణాలు, గ్రామాల్లో, పర్యటిస్తూ ఇటుక బట్టీ ల్లో కార్మికవాడల్లో, పరిశ్రమల్లో పరిశీలిస్తున్నారు. సర్వే నిర్వహణకు ప్రధానోపాధ్యాయుల సహకారం తీసుకుంటున్నారు. ప్రతీ పాఠశాల పరిధిలో బడి బయటి పిల్లల దస్ర్తాల ఆధారంగా సర్వే కొనసాగు తోంది.
నెలాఖరులోగా తుది జాబితా
జిల్లాలో పిల్లలను గుర్తించే సర్వే మొదలైంది. ఈ నెల 15 నుంచి 22 వరకు క్షేత్రస్థాయిలో గుర్తించిన పిల్లల వివరాలను మండల స్థాయిలో అప్‌లోడ్‌ చేయనున్నారు. 27న జిల్లా స్థాయిలో జాబితాను మరోసారి పరిశీలించి తప్పులేమైనా ఉన్నాయా? అనే కోణంలో ఆరా తీస్తారు. 28న జిల్లా విద్యాధికారులు ప్రభుత్వానికి నివేదించనున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు సర్వేను పర్యవేక్షిస్తున్నారు.

Updated Date - 2021-01-16T06:09:23+05:30 IST