వివరాలు నమోదు చేస్తున్న ఎస్ఎస్ఏ కోఆర్డినేటర్
ఏలూరుఎడ్యుకేషన్, జనవరి 21: జిల్లా వ్యాప్తంగా బడి బయట పిల్లల సర్వే నిర్వహిస్తున్నట్టు సమగ్ర శిక్ష జిల్లా అదనపు ప్రాజెక్టు కో–ఆర్డినేటర్ పి.శ్యాంసుందర్ తెలిపారు. జిల్లాలో 8940 మంది బడి బయట పిల్లలను గుర్తించామని, వారిని తిరిగి పాఠశాలల్లో చేర్పించ డానికి చర్యలు తీసుకున్నట్టు వివరించారు. జిల్లాలో 712 మంది సీఆర్పీలు, ఐఈఆర్పీలు, పీటీఐలు ఇంటింటా సర్వే నిర్వహించి ‘మనబడికి పోదాం’ యాప్ ద్వారా సర్వే నిర్వహించి గుర్తించిన పిల్లలను పాఠశాలల్లో చేరుస్తున్నట్లు వివరిం చారు. సర్వే ఈనెల 29 వరకు కొనసాగుతుందన్నారు. శుక్రవారం జిల్లాలో పలు వురు బడిబయట పిల్లలను సమీప పాఠశాలల్లో చేర్పించినట్టు తెలిపారు. ఎస్ఎస్ఏ కోఆర్డినేటర్ జి.రాధాకృష్ణ, సెక్టోరల్ అధికారులు పాల్గొన్నారు.