బొప్పాస్‌పల్లిలో విత్తన క్షేత్ర భూములపై సర్వే

ABN , First Publish Date - 2021-01-16T05:34:31+05:30 IST

మండలంలోని బొప్పాస్‌పల్లి విత్తన క్షేత్రంలోని భూములపై శుక్రవారం రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించారు.

బొప్పాస్‌పల్లిలో విత్తన క్షేత్ర భూములపై సర్వే
బొప్పాస్‌పల్లి విత్తన క్షేత్రంలో సర్వే నిర్వహిస్తున్న అధికారులు

నస్రుల్లాబాద్‌, జనవరి 15: మండలంలోని బొప్పాస్‌పల్లి విత్తన క్షేత్రంలోని భూములపై శుక్రవారం రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించారు. బొప్పాస్‌పల్లి విత్తన క్షేత్రంలో మొత్తం 472 ఎకరాల భూమి ఉందని సర్వేయర్‌ శ్రీనివాస్‌ తెలిపారు. బొప్పాస్‌పల్లి విత్తన క్షేత్రంలోని భూములు కబ్జాకు గురవుతున్నాయని, ఏడీ చంద్రశేఖర్‌ ఫిర్యాదు మేరకు, కలెక్టర్‌ ఆదేశాలతో విత్తన క్షేత్రంలో సర్వే చేపడుతున్నట్లు చెప్పారు. బొప్పాస్‌పల్లి విత్తన క్షేత్రంలో 11/1, 11/3, 28/2, 28/3, 29/1, 29/2, 29/3, 16, 17సర్వే నెంబర్లలో సర్వే నిర్వహించామన్నారు. బొప్పాస్‌పల్లి విత్తన క్షేత్రం భూములు ఎవరైనా కబ్జా చేస్తే చర్యలు తప్పబోవన్నారు. నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామన్నారు. ఈ సర్వేలో డివిజన్‌ సర్వేయర్‌ దేవరావు, ఆర్‌ఐ పండరీ, సర్వేయర్లు సౌందర్య, సునీత, అనిల్‌ తదితరులున్నారు.

Updated Date - 2021-01-16T05:34:31+05:30 IST