బోయపాటి దర్శకత్వంలో సూర్య!

Jun 16 2021 @ 01:48AM

తమిళ కథానాయకుడు సూర్యతో దర్శకుడు బోయపాటి శ్రీను ఓ సినిమా చేయనున్నారా? అంటే... పరిశ్రమ వర్గాలు ‘అవును’ అంటున్నాయి. ఈ మధ్యే ఇద్దరి మధ్య చర్చలు జరిగాయట. సూర్యకు బోయపాటి లైన్‌తో పాటు కొంత కథ చెప్పారట. హీరో నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ లభించడంతో బౌండ్‌ స్ర్కిప్ట్‌ సిద్ధం చేసే పనిలో పడ్డారట. సూర్య చేయబోయే స్ట్రయిట్‌ తెలుగు సినిమా ఇదే కానుంది. తెలుగు-తమిళ ద్విభాషా సినిమాగా దీనిని తెరకెక్కించనున్నారు. అలాగే, ఇతర దక్షిణాది భాషల్లోనూ...  హిందీలోనూ అనువదించి విడుదల చేసే ఆలోచన ఉందట. ఇకపై తీయబోయే చిత్రాలను పాన్‌ ఇండియా స్థాయిలో చేసేలా బోయపాటి ప్లాన్‌ చేసుకుంటున్నారని సమాచారం. అల్లు అర్జున్‌తో చేయబోయే సినిమా, సూర్య సినిమా పాన్‌ ఇండియా చిత్రాలేనట. మాస్‌ చిత్రాలకు దర్శకుడు బోయపాటి శ్రీను పెట్టింది పేరు. తన సినిమాల్లో మాస్‌తో పాటు కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాలు తప్పకుండా ఉండేలా చూసుకుంటారు. ఆయన తీసిన చిత్రాలు కొన్ని ఇతర భాషల్లో రీమేక్‌ అయ్యాయి. హిందీలో అనువాదం కాగా మిలియన్స్‌ వ్యూస్‌ వచ్చాయి. ఇప్పుడు ఆయనే ఇతర భాషలకు వెళ్లాలని అనుకుంటున్నారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.