గౌతమ్ గంభీర్ నమ్మకమే నా జీవితాన్నే మార్చేసింది

ABN , First Publish Date - 2022-04-20T00:45:09+05:30 IST

ముంబై : ఒంటి చేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పగల సత్తా ఉన్న ఆటగాడు సూర్యకుమార్ యాదవ్. ఐపీఎల్‌లో అద్భుత ఆటతీరుతో ఏకంగా టీమిండియాలో చోటు దక్కించుకున్న ఈ డ్యాషింగ్ బ్యాట్స్‌మెన్ తన కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు.

గౌతమ్ గంభీర్ నమ్మకమే నా జీవితాన్నే మార్చేసింది

ముంబై : ఒంటి చేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పగల సత్తా ఉన్న ఆటగాడు సూర్యకుమార్ యాదవ్. ఐపీఎల్‌లో అద్భుత ఆటతీరుతో ఏకంగా  టీమిండియాలో చోటు దక్కించుకున్న ఈ డ్యాషింగ్ బ్యాట్స్‌మెన్ తన కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. తనపై టీమిండియా మాజీ బ్యాట్స్‌మెన్ గౌతమ్ గంభీర్  అపారమైన నమ్మకం ఉంచడంతోనే తాను ఈ స్థాయికి ఎదిగానని చెప్పాడు. గంభీర్‌కు ఉన్న అచెంచెల విశ్వాసమే తన కెరీర్‌ను పూర్తిగా మార్చివేసిందని కొనియాడాడు. గౌరవ్ కపూర్ షో ‘బ్రేక్‌ఫాస్ట్ విత్ చాంపియన్స్’లో సూర్యకుమార్ యాదవ్  ఈ విషయాలను తెలిపాడు. 


‘‘ నా టాలెంట్‌పై నమ్మకం పెట్టుకున్న మొదటి ఆటగాడు గౌతమ్ గంభీరే. ఆయనే నన్ను సరైన దిశలో నడిపించారు. 2014లో కలకత్తా నైట్ రైడర్స్‌కు ఆడుతున్నప్పుడు నాలో ఏదో ప్రత్యేకత ఉందని గంభీర్ భావించాడు. నన్ను సరైన దిశలో నడిపిస్తే మంచి ఆటగాడినవుతానని గంభీర్ గ్రహించాడు. ఇప్పుడు అందరూ స్కై(ఎస్‌కేవై) అని పిలిచే పేరు ఆయన పెట్టిందే. కేకేఆర్‌కు ఆడుతున్నప్పుడు స్కై అని పిలిచేవాడు. నేను ఆశ్చర్యంగా చూస్తే ప్రారంభంలో ఎలా ఉండేవాడివో గుర్తు చేసుకోమంటూ చెప్పేవాడు. అప్పుడు అర్థం చేసుకున్నాను నేను ఎంత ఎదిగానోనని’’ అని సూర్యకుమార్ యాదవ్ గుర్తుచేసుకున్నాడు. అంతేకాకుండా ముంబై ఇండియన్స్, జాతీయ టీంలో డ్రెసింగ్ రూం అనుభవాలను కూడా పంచుకున్నాడు.

Updated Date - 2022-04-20T00:45:09+05:30 IST