AP News: రెండో రోజు సూర్యనారాయణుడిని తాకిన సూర్యకిరణాలు

ABN , First Publish Date - 2022-10-02T13:22:31+05:30 IST

ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవల్లి దేవాలయంలో రెండవ రోజు శ్రీ సూర్యనారాయణ స్వామి మూలవిరాట్‌ను సూర్యకిరణాలు పాక్షికంగా తాకాయి.

AP News: రెండో రోజు సూర్యనారాయణుడిని తాకిన సూర్యకిరణాలు

శ్రీకాకుళం: ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవల్లి దేవాలయంలో రెండవ రోజు శ్రీ సూర్యనారాయణ స్వామి మూలవిరాట్‌ను సూర్యకిరణాలు పాక్షికంగా తాకాయి. ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి తరలివచ్చారు. స్వామి వారిని సూర్యకిరణాలు తాకండ చూసి భక్తులు పులకించిపోయారు. దక్షిణాయణం అక్టోబర్ 1, 2 తేదీలలో, ఉత్తరాయణం మార్చి 9,10 తేదీలలో స్వామి వారికి సూర్య కిరణాలు తాకడం ఆనవాయితీ వస్తోంది. 

Updated Date - 2022-10-02T13:22:31+05:30 IST