ఆన్‌లైన్‌లో దర్శకత్వం, నటనపై సుశీంద్రన్ క్లాసులు

Jun 6 2021 @ 18:28PM

కోలీవుడ్: తమిళ దర్శకుడు సుశీంద్రన్‌, ఫ్యూచర్‌ సినిమాస్‌ల ఆధ్వర్యంలో ఈనెల 14వ తేదీ నుంచి పది రోజుల పాటు దర్శకత్వ శాఖలో ఆన్‌లైన్‌ కోర్సు ప్రారంభం కానుంది. పది రోజుల పాటు జరిగే ఈ ఆన్‌లైన్‌ కోర్సులో చేరే వారి నుంచి రోజుకు వంద రూపాయల చొప్పున పది రోజులపాటు వసూలు చేస్తారు. తద్వారా వచ్చిన సొమ్మును ముఖ్యమంత్రి కోవిడ్‌ సహాయ నిధికి అందజేస్తారు. ఈనెల 26వ తేదీ వరకు జరిగే ఈ ఆన్‌లైన్‌ కోర్సు తరగతులు... సాయంత్రం 5 గంటల నుంచి 6.30 గంటల వరకు జరుగుతాయి. ఆన్‌లైన్‌ ద్వారా జరిగే తరగతుల్లో దర్శకుడు సుశీంద్రన్‌ పాల్గొని దర్శకత్వంతో పాటు నటనలో మెళకువలతో పాటు వివిధ అంశాలను బోధిస్తారు. ఈ కోర్సుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం 82484 69663 లేదా 93424 79535 లేదా 93424 97700 అనే మొబైల్‌ నంబర్లలో సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ కోర్సులో చేరేవారు ఖచ్చితంగా పది రోజుల పాటు జరిగే పది సెషన్ల ఆన్‌లైన్‌ క్లాసులకు విధిగా హాజరుకావాల్సి ఉంటుంది.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.